News February 8, 2025
పెంబి: పురుగుమందు తాగి వివాహిత మృతి

పురుగు మందు తాగి వివాహిత మృతి చెందిన ఘటన పెంబి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై హనుమండ్లు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లికి చెందిన మాలావత్ సానుక(22)ను ఆమె భర్త ఈనెల 3న మొక్కజొన్న పంటకు నీళ్లు పారీయమని చెప్పగా ఆమె క్షణికావేశానికి లోనై పురుగుల మందు తాగిందన్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News April 19, 2026
కడప: మీ పిల్లలకు వినికిడి సమస్య ఉందా.?

వినికిడి సమస్య ఉన్న ఎందరో చిన్నారుల జీవితాలు చిన్నాభిన్నం కాకుండా TTD ‘శ్రవణం’ పేరుతో కాపాడుతోంది. సాంకేతికతతో <<19688732>>చెవుడు<<>>ను పోగొట్టవచ్చు. ఇది తెలియని తల్లిదండ్రులు తమ చిన్నారుల విషయంలో నష్టపోతున్నారు. వీరి కోసమే TTD 2006 నుంచి తిరుపతిలోని ఓల్డ్ మెటర్నిటీ ఆసుపత్రి భవనంలో శ్రవణం ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు 14 వందల మంది చిన్నారులకు సమ్యను దూరం చేశారు.
# SHARE IT.
News April 19, 2026
KKR జట్టులో చేరిన స్టార్ బౌలర్

IPL: KKR జట్టులో స్టార్ బౌలర్ మతీశ పతిరణ జాయిన్ అయ్యారు. శ్రీలంక క్రికెట్ బోర్డ్ NOC ఇవ్వడంతో ఆయన తాజాగా తమ క్యాంపులోకి ఎంట్రీ ఇచ్చినట్లు KKR యాజమాన్యం ప్రకటించింది. డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే ఈ బౌలర్ రాకతో అయినా KKR ఫేట్ మారుతుందేమో చూడాలి. అయితే ఇవాళ RRతో జరిగే మ్యాచులో అతను ఆడతారా? లేదా? అనేది క్లారిటీ లేదు. ఈ సీజన్‌లో KKR ఆడిన 5 మ్యాచుల్లోనూ ఓడగా ఒకటి రద్దయింది.
News April 19, 2026
నిప్పుల కొలిమిలా నిజామాబాద్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. ఉ.10 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు తమ పనులను ఉదయం ముగించుకుని ఇళ్లకు పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చేందుకు సాహసించడం లేదు. ఎండ దెబ్బకు రహదారులన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. అగ్నిగుండంలా మారుతున్న వాతావరణంతో అటు వాహనదారులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


