News February 8, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> కుందారంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
> ముగ్గురు పిల్లలు ఉన్నవారికి స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించాలని గాంధీ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష
> పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నేతల సన్నాహక సమావేశం
> కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి అనుచరుడు
> టాప్ ర్యాంకే లక్ష్యంగా జిల్లాలో ‘విజయోస్తూ’ కార్యక్రమం
> సేవాలాల్ జయంతికి డీసీపీకి ఆహ్వానం
Similar News
News March 26, 2026
HYD: సూసైడ్ నోట్ రాసి యువతి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్‌లోని పేట్ బషీరాబాద్ PS పరిధిలో పల్లవి లహరి(19) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సందీప్‌తో ప్రేమలో ఉన్న ఆమె, మార్చి 24 జరిగిన గొడవ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుంది. సందీప్ తిరిగి వచ్చి చూడగా, అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 26, 2026
HNK: మత్తు పౌడర్ కేసులో ముగ్గురికి 10 ఏళ్ల జైలు శిక్ష

హనుమకొండ జిల్లా కోర్టు మత్తు పదార్థాల కేసులో ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆర్.లక్ష్మణరావు, పూసల చైతన్యకుమార్, లింగాల సైదులకు తలా రూ.2 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు చెప్పారు. 2023లో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు మత్తు పౌడర్ తరలిస్తుండగా అలంకార్ జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నేరం రుజువైంది.
News March 26, 2026
మరో డేంజర్.. ముదరనున్న చమురు సంక్షోభం?

ఖర్గ్ <<19478356>>ద్వీపం<<>> స్వాధీనానికి US ప్లాన్ చేస్తే యెమన్ సమీపాన ఉండే బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సరకు రవాణాకు ఇది ఎంతో కీలకం. ఇది మూతబడితే ఆఫ్రికా <<19394249>>చుట్టూ<<>> తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ట్రంప్ చర్యలతో చమురు సంక్షోభం ముదిరేలా ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా ఇటీవల యెమెన్ మిలిటెంట్ గ్రూప్ హౌతీ ఇరాన్‌కు మద్దతు తెలిపింది.


