News February 9, 2025

ఒంటరిగా ఉంటున్నారా?

image

దీర్ఘకాలిక ఒంటరితనం శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ‘ఒంటరిగా ఉంటే.. మరణించే ప్రమాదం 29% పెరుగుతుంది. రోజుకు 15 సిగరెట్లు తాగడం కంటే ఎక్కువ ప్రమాదం. గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఆందోళన పెరుగుతుంది’ అని అధ్యయనాలు చెబుతున్నాయి.

Similar News

News March 23, 2026

అఫిడవిట్ ఉంటేనే సాదాబైనామా రిజిస్ట్రేషన్లు!

image

TG: సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు రెవెన్యూశాఖ కొత్త రూల్స్‌ను GOVTకి ప్రతిపాదించింది. ఇకపై వీటి రిజిస్ట్రేషన్‌కు అఫిడవిట్లను తప్పనిసరి చేయడం వంటి రూల్సు రానున్నాయి. రాష్ట్రంలో దాదాపు 9.50 లక్షల సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు రాగా అందులో 20వేలు మాత్రమే పరిష్కారమయ్యాయి. న్యాయపరమైన చిక్కులతో మిగతావి పెండింగ్‌లో పడ్డాయి. కొత్త రూల్స్‌ వస్తే అఫిడవిట్ ఉంటేనే సాదాబైనామా రిజిస్ట్రేషన్ అవుతుంది.

News March 23, 2026

అసలైన ‘ధురంధర్’.. రవీంద్ర కౌశిక్(1/2)

image

‘ధురంధర్-2’ హిట్టైన నేపథ్యంలో రియల్ లైఫ్ ‘ధురంధర్’ రవీంద్ర కౌశిక్ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈయన కేవలం 23 ఏళ్ల వయసులోనే RAW ఏజెంట్‌గా ఎంపికై.. ‘నబీ అహ్మద్ షకీర్’ పేరుతో పాకిస్థాన్‌కు వెళ్లారు. అక్కడ LLB పూర్తిచేసి పాక్ సైన్యంలో ఉద్యోగం పొంది మేజర్ స్థాయికి ఎదిగారు. 1979-1983మధ్య పాక్ సైన్యంలోని రహస్యాలు, అణ్వాయుధ కార్యక్రమ సమాచారాన్ని భారత్‌కు చేరవేసేవారు.

News March 23, 2026

రవీంద్ర కౌశిక్ అలియాస్ బ్లాక్ టైగర్ (2/2)

image

పాక్ సైన్యంలో ఉంటూ రవీంద్ర అందించిన సమాచారంతో శత్రువుల అనేక యుద్ధ ప్రణాళికలను భారత్ తిప్పికొట్టింది. అందుకే అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు ‘బ్లాక్ టైగర్’ బిరుదు ఇచ్చారు. జూనియర్ ఏజెంట్ చేసిన చిన్న పొరపాటు వల్ల 1983లో ఆయన పాక్ అధికారులకు చిక్కారు. 16ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించి 2001లో అక్కడే కన్నుమూశారు. ‘ధురంధర్ 2’ రిలీజ్ నేపథ్యంలో ఈ వీరుడి త్యాగాన్ని అంతా గుర్తుచేసుకుంటున్నారు.