News February 9, 2025
నిన్న ప్లేయర్.. నేడు కామెంటేటర్

టీమ్ ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ SA T20లో మరో అవతారం ఎత్తారు. నిన్నటి వరకు ఆటగాడిగా అలరించిన కార్తీక్ ఇవాళ జరుగుతున్న ఫైనల్ మ్యాచులో కామెంటేటర్‌గా మారారు. తోటి కామెంటేటర్లతో కలిసి కామెంట్రీ బాక్స్‌లో ఆయన సందడి చేశారు. కాగా ఈ టోర్నీలో కార్తీక్ పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించారు. 7 మ్యాచుల్లో 130 పరుగులు బాదారు. ఐపీఎల్ 2025లో ఆర్సీబీకి మెంటార్‌గా వ్యవహరించనున్నారు.
Similar News
News September 14, 2025
‘వాహనమిత్ర’కు ఎవరు అర్హులంటే?

AP: <<17704079>>వాహనమిత్ర<<>> కింద రూ.15 వేలు పొందాలంటే ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్‌గా ఉండాలి. గూడ్స్ వాహనాలకు వర్తించదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీలో ఒక్క వాహనానికే పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, IT కట్టేవారు ఉండకూడదు. సిటీల్లో 1000 చ.అ.లకు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులు. AP రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లుండాలి. కరెంట్ బిల్లు నెలకు 300యూనిట్లలోపు రావాలి.
News September 14, 2025
వరి: సెప్టెంబర్‌లో కలుపు, చీడపీడల నివారణ

* నాటిన 12 రోజులకు వరి పొలంలో కలుపు ఉంటే సైహలోఫాప్-పి-బ్యులైల్ 1.5ML లేదా బిస్‌ఫైరిబాక్ సోడియం 0.5ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* అగ్గి తెగులు: ఐసోప్రోథయోలేన్ 1.5ML లేదా కాసుగామైసిన్ 2.5ML లేదా ట్రైసైక్లజోల్+మ్యాంకోజెబ్ 2.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పాముపొడ తెగులు: హెక్సాకొనజోల్ 2ML లేదా ప్రొపికొనజోల్ 1ML లేదా వాలిడామైసిన్ 2ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News September 14, 2025
368 పోస్టులకు RRB నోటిఫికేషన్

<