News February 9, 2025

మందమర్రి: GMకు అధికారుల CMOAI వినతి

image

మందమర్రి ఏరియా CMOAI కార్యవర్గ సభ్యులు పలు అంశాలపై GMదేవేందర్‌కు వినతిపత్రం అందజేశారు. అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ..త్వరితగతిన PRPచెల్లింపుకు ఏర్పాటు చేయాలన్నారు. అధికారుల సంఘంతో జరిగిన సమస్యల పరిష్కారానికి వెంటనే తగు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఫంక్షనల్ డైరెక్టర్స్ విషయంలో కొనసాగుతున్న అనిశ్చిత స్థితి తొలగేల న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Similar News

News March 20, 2026

కేంద్రీయ గిరిజన యూనివర్సిటీకి సహకారం: భట్టి

image

ములుగు జిల్లాలో నిర్మిస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. ఆదివాసీ గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గిరిజన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్‌ను మరింత విస్తరిస్తామని తెలిపారు.

News March 20, 2026

రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షసూచన

image

AP: పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరికాసేపట్లో కృష్ణా జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఇప్పటికే ఆ జిల్లాలో కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. మరో 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.

News March 20, 2026

వెయిట్ లాస్ మందుల ధర తగ్గించిన నాట్కో

image

అధిక బరువుతో బాధపడేవారికి NATCO గుడ్ న్యూస్ చెప్పింది. నోవో నార్డిస్క్ పేటెంట్ గడువు ముగియడంతో సెమాగ్లుటైడ్ జెనరిక్ వెర్షన్‌ను అత్యంత చౌకగా మార్కెట్లోకి తెచ్చింది. SEMANATTM, SEMAFULLTM బ్రాండ్ల పేరుతో లభించే మల్టీ-డోస్ వయల్స్ ధరను కేవలం ₹1,290గా నిర్ణయించింది. ఇది అసలు బ్రాండ్ ధర కంటే దాదాపు 90% తక్కువ కావడం విశేషం. ఏప్రిల్‌లో పెన్ డివైజ్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి.