News February 9, 2025
KMR: మార్పు డెస్క్‌ను సందర్శించిన MCH అధికారి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739030388668_60314684-normal-WIFI.webp)
కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం మార్పు డెస్క్ ద్వారా అందుతున్న సేవలను జిల్లా మాతా శిశు ఆరోగ్య ప్రోగ్రాం అధికారి డా.అనురాధ సందర్శించారు. గ్రామాల నుంచి జిల్లా ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు, బాలింతలకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆమె సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మార్పు డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News February 9, 2025
నేడే రెండో వన్డే.. జట్టులో ఎన్ని మార్పులు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739059152593_893-normal-WIFI.webp)
IND, ENG మధ్య కటక్ వేదికగా ఇవాళ మ.1:30 నుంచి రెండో వన్డే జరగనుంది. కోహ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో జైస్వాల్‌ను తప్పిస్తారా? రోహిత్ ఫామ్‌లోకి వస్తాడా? వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అతడి కోసం కుల్దీప్‌ను పక్కన పెడతారా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎలాగైనా గెలవాలని ENG కసిగా ఉంది. sports 18-2, hotstarలో లైవ్ చూడవచ్చు. WAY2NEWS లైవ్ స్కోర్ అప్‌డేట్స్ పొందవచ్చు.
News February 9, 2025
భద్రాద్రిలో దారుణం.. గర్భిణి ఆత్మహత్యాయత్నం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739033927081_1280-normal-WIFI.webp)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలోని రామాంజిగూడెంకు చెందిన మౌనిక అనే గర్భిణి కుటుంబ కలహాలతో శనివారం పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న భర్త మధు హుటాహుటిన ఆళ్లపల్లి ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు వివరించారు.
News February 9, 2025
సీట్ల తేడా ఎక్కువున్నా ఓట్ల వ్యత్యాసం తక్కువే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739058580059_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AAP మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువే ఉంది. BJPకి 45.56% పోలవగా ఆప్‌కు 43.57% వచ్చాయి. కానీ సీట్ల తేడా మాత్రం 26 స్థానాలుగా ఉంది. కాషాయ పార్టీ 48 స్థానాలను గెలుచుకోగా ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ముగ్గురు అభ్యర్థులూ ‘చీపురు’ పార్టీకి చెందినవారే కాగా అత్యల్ప మెజార్టీతో విజయం సాధించిన చివరి ముగ్గురూ కమలం అభ్యర్థులే కావడం గమనార్హం.