News February 9, 2025
టెన్త్‌లో వంద శాతం రిజల్ట్ రావాల్సిందే: మంత్రి

బీసీ సంక్షేమశాఖ హాస్టళ్లలో టెన్త్‌లో వంద శాతం రిజల్ట్ రావాల్సిందేనని మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్‌లో జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో నెల రోజుల్లో జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థుల ప్రిపరేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 13, 2026
గ్యాస్ బుక్ చేసే వారికి ఎస్పీ సూచనలు

గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు SP వకుల్ జిందాల్ సూచించారు. వంటగ్యాస్ సిలెండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మల్చుకొని ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. అదనపు సిలెండర్లు కేటాయిస్తామని బురిడీ కొట్టిస్తున్నారని వివరించారు. అనుమానస్పద లింకులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చెయ్యొద్దని సూచించారు.
News March 13, 2026
జగిత్యాల: ముగిసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు 30 కేంద్రాల్లో నిర్వహించగా 97.55% హాజరు నమోదైంది. జనరల్ కోర్సుల్లో 5671 మందికి గాను 5571 మంది హాజరై 100 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 546 మందికి గాను 494 మంది హాజరై 52 మంది గైర్హాజరయ్యారు. నేటితో జనరల్ విభాగం పరీక్షలు ముగిశాయి. పరీక్షలు సరిగా రాయకపోయిన వారు మేలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని పరీక్షల కన్వీనర్ నారాయణ తెలిపారు.
News March 13, 2026
గ్యాస్ ధరల ప్రభావం ప్రజలపై పడకుండా చూడాలి: జీవన్ రెడ్డి

జగిత్యాలలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచంపై పడుతోందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో వంట గ్యాస్ ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. రూ.500 సిలిండర్ పథకంలో ధరల పెంపు భారం వినియోగదారులపై పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


