News February 9, 2025
రేవుపోలవరం: జాతర ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

రేవుపోలవరంలో ఈనెల 11, 12 తేదీల్లో జరిగే మాఘ పౌర్ణమి జాతర ఏర్పాట్లను నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. జాతర జరిగే రేవుపోలవరం సముద్ర తీరాన్ని శనివారం సందర్శించారు. సముద్ర స్నానాలు ఆచరించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. డీఎస్పీ వెంట సీఐ రామకృష్ణ, ఎస్సై విభీషణరావు ఉన్నారు.
Similar News
News March 25, 2026
మంథని నియోజకవర్గం ‘చీలి’పోనుందా?

2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో మంథని నియోజకవర్గం రెండుగా చీలిపోనుందనే చర్చ జోరందుకుంది. నియోజకవర్గంలో 10 మండలాలు, 2.40 లక్షల మంది ఓటర్లున్నారు. భౌగోళికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంథని పెద్ద నియోజకవర్గం. కాగా, కాటారం, మహాదేవపూర్, మహ ముత్తారం, మల్హర్, పలిమెల మండలాలతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు అవుతుందనే రాజకీయ చర్చ నడుస్తోంది.
News March 25, 2026
ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయనంది: ట్రంప్

న్యూక్లియర్ వెపన్స్‌ను ఎప్పటికీ తయారు చేయనని ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ ప్రకటించారు. రీసెంట్‌గా జరిగిన చర్చల్లో మంచి ప్రోగ్రెస్ కనిపిస్తోందని, ఇరాన్ ఇప్పుడు కాస్త పద్ధతిగా మాట్లాడుతోందని అన్నారు. అయితే ఇరాన్ అధికారులు మాత్రం ఈ చర్చల వార్తలను కొట్టిపారేస్తున్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ మాత్రం ఐదు రోజుల గడువు ఇచ్చి డీల్ కుదురుతుందన్న ఆశతో ఉన్నారు.
News March 25, 2026
సంగారెడ్డి: టీబీ రహిత గ్రామంగా కడ్పల్ ఎంపిక

సిర్గాపూర్ మండలం కడ్పల్ టీబీ రహిత గ్రామంగా ఎన్నికైనట్లు జిల్లా టీబీ సూపర్వైజర్ అరుణకుమారి తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డిలో సర్పంచ్ మల్లగారి విమల, కార్యదర్శి అరుణ్ కుమార్‌ను అభినందిస్తూ ప్రశంసాపత్రం అందజేశారు. గ్రామంలో ప్రజల ఆరోగ్య సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. టీబీ నిర్మూలనలో బాచేపల్లి PHCకి 3వ స్థానం దక్కింది.


