News February 9, 2025
జిల్లాస్థాయి పోలీస్ సినర్జీ స్పోర్ట్స్ మీట్ పోటీలు

నంద్యాలలో నంది బ్యాట్మెంటన్ అకాడమీలో డివిజనల్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ మెన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమం అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా SP అధిరాజ్ సింగ్ రాణా పాల్గొని క్రీడలను విజయవంతం చేశారు.
Similar News
News September 18, 2025
సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. జాతీయ రహదారి 65పై జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ.. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. పైనుంచి వెళ్లడంతో ఆమె శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News September 18, 2025
వరంగల్: తుపాకీ పట్టారు.. తూటాకు బలయ్యారు..!

కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు నేలకొరుగుతున్నారు. ఛత్తీస్‌గఢ్ వరుస ఎన్కౌంటర్లతో అగ్ర నేతలు అమరులవుతున్నారు. ఇప్పటివరకు జనగామకు చెందిన గుమ్మడవెల్లి రేణుక, భూపాలపల్లికి చెందిన గాజర్ల రవి, వరంగల్‌కు చెందిన మోదెం బాలకృష్ణతో పాటు సుధాకర్, ఏసోలు, అన్నై సంతోశ్, సారయ్య, ఇలా ఒక్కొక్కరుగా ఉద్యమ బాటలో ఊపిరి వదులుతున్నారు.
News September 18, 2025
నేడు ప్రపంచ వెదురు దినోత్సవం

ఏ ప్రాంతమైనా, భూమి రకం ఎలాంటిదైనా సాగుకు అనుకూలమైన పంట వెదురు. తక్కువ పెట్టుబడితో నీటి వసతి నామమాత్రంగా ఉన్నా, ఎరువులు, పురుగు మందులతో పనిలేకుండా ఈ పంటను సాగు చేయవచ్చు. వంట చెరకుగా, వివిధ నిర్మాణాలు, ఫర్నిచర్, కళాకృతుల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. వెదురు పంట రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తూ, పర్యావరణానికీ ఎంతో మేలు చేస్తోంది. ఏటా సెప్టెంబర్-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తున్నారు.