News February 9, 2025
ములుగు: గుప్పుమంటున్న గుడుంబా

కన్నాయిగూడెం మండలంలో గుడుంబా గుప్పుమంటుంది. పలు గ్రామాల్లో రహస్యంగా గుడుంబా విక్రయిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో గుడుంబా విక్రయ, తయారీదారులపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మారి అడ్డుకట్ట పడడం లేదన్నారు. బుట్టాయిగూడెంలోని ఓ ప్రాంతంలో గుడుంబా తాగి స్పృహ కోల్పోయి కాల్వలో పడిన ఓ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Similar News
News November 13, 2025
కొల్లాపూర్: నల్లమల అడవుల రక్షణకు చెక్‌పోస్ట్

నల్లమల అడవులు ఆక్రమణకు గురికాకుండా కట్టడి చేసేందుకు ఒట్టిమాకులకుంట దారిలో అటవీశాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ దారి గుండా అడవులకు కబ్జాదారులు వెళ్లే మార్గాన్ని మూసివేసినట్లు అచ్చంపేట డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2011–2014 మధ్య కాలంలో నల్లమల అడవులను నరికివేసి అక్రమ సాగు చేసినట్లు గుర్తించామన్నారు.
News November 13, 2025
వరంగల్: ఛార్జ్ తీసుకోకుండానే వెనక్కి వెళ్లిన డీసీపీ..!

WGLలో రాజకీయ నాయకుల అనుమతి లేనిదే పోస్టింగ్‌లో చేరడం అసాధ్యం. అలాంటిది ఏకంగా WGL సెంట్రల్ జోన్ DCPగా బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన IPS అధికారికి చేదు అనుభవం ఎదురైంది. తనకు తెలియకుండా ఎలా బదిలీ చేశారంటూ ఓ నేత భర్త ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెంట్రల్ జోన్ DCP బాధ్యతలు తీసుకోవడానికి వచ్చిన సదరు అధికారి హరిత హోటల్ నుంచి నేరుగా HYDకి తిరిగి వెళ్లినట్లు సమాచారం. అధికారులకు విషయం తెలియడంతో షాక్‌లో ఉన్నారు.
News November 13, 2025
యాదగిరిగుట్ట: ప్రొటోకాల్ దర్శనాలపై కీలక నిర్ణయాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రొటోకాల్ దర్శనాలపై దేవస్థానం ఈవో వెంకట్రావు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. గురువారం దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రొటోకాల్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న 3 రోజుల పాటు ఏజెంట్లు, రిఫరెన్స్ ఫోటో కాల్స్ పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.


