News February 9, 2025
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది నియామకం, పోలింగ్ బూతుల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 9, 2026
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ధరలు ఇలా..!

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం ధరలు వెలువడ్డాయి. పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,149, వేరుశనగ గరిష్ఠ ధర రూ.8,800, ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,994 పలికాయి. శనగలు గరిష్ఠ ధర రూ 5,061, కందులు గరిష్ఠ ధర రూ. 7,257 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు గడువు ముగియడంతో కేంద్రాలు మూతపడి, పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. వేరుశనగ ధరలు వారం రోజులుగా పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News March 9, 2026
పిఠాపురం: జనసేన ఆవిర్భావ సభపై ఉత్కంఠ

మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారి భారీ సభ ఉంటుందా లేదా అనే దానిపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ప్రతి సంవత్సరం పిఠాపురంలోనే సభ నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. అయితే సభకు సమయం తక్కువగా ఉండటంతో సోమవారం నాటికి ఎటువంటి ఏర్పాట్లు కనిపించకపోవడం గమనార్హం. దీనిపై అటు శ్రేణుల్లో, ఇటు ప్రజల్లో సందిగ్ధత నెలకొంది.
News March 9, 2026
షోకాజ్ నోటీసులపై సచివాలయ సర్వేయర్ల ఆగ్రహం

సెలవు పెట్టి ఆందోళనలో పాల్గొంటే షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో క్యాజువల్ లీవ్ పెట్టి నిరసన తెలిపిన తమకు, సోమవారం నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. రెండు రోజుల తర్వాత సెలవులను రద్దు చేయడంపై వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని సర్వేయర్లు హెచ్చరించారు.


