News February 9, 2025
ముధోల్: ఇంటి నిర్మాణాల తవ్వకాల్లో పురాతన నాణేలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739019692392_9539271-normal-WIFI.webp)
ముధోల్ మహాలక్ష్మిగల్లీకి చెందిన లూటే మారుతి పటేల్ ఇంటిని నిర్మాణ పనులను శుక్రవారం చేపట్టారు. పిల్లర్ కోసం తవ్వుతుండగా మట్టి కుండలో 92 అతి పురాతన నాణేలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సంజీవ్, తహశీల్దార్ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని చేరుకొని తవ్వకాల్లో బయటపడ్డ నాణేలను పరిశీలించారు. నాణేలను జిల్లా ఖజానా కార్యాలయంలో జమ చేస్తున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు.
Similar News
News February 9, 2025
నిజామాబాద్‌లో తగ్గిన చికెన్ అమ్మకాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739074800383_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లాలోని పలు కోళ్ల ఫారాలలో వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లాలో చికెన్ అమ్మకాలు తగ్గాయి. నేడు మార్కెట్లో పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు స్కిన్‌తో రూ.160, స్కిన్ లెస్ రూ.220 వరకు ఉంది. వ్యాధి ప్రభావంతో ప్రజలు చికెన్ కొనేందుకు వెనుకంజ వేస్తున్నట్లు అమ్మకం దారులు తెలిపారు.
News February 9, 2025
కరీంనగర్: ఉచిత శిక్షణ దరఖాస్తులకు నేడే చివరి తేదీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739075368892_1259-normal-WIFI.webp)
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన BC, SC, ST అభ్యర్థులు RRB, SSC, Banking ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ Way2News కు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారు ఫిబ్రవరి 9 వరకు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News February 9, 2025
సన్న బియ్యం సరఫరా చేసే ఆలోచనలో ప్రభుత్వం: అనిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739075070063_19090094-normal-WIFI.webp)
రాష్ట్రంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సన్న రకం వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.