News February 9, 2025
ఆదిలాబాద్: ఇద్దరు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ సునీల్ వివరాల ప్రకారం.. స్థానిక సీసీఐ ఫ్యాక్టరీ వద్ద శనివారం వాహనాల తనిఖీ చేస్తున్న సందర్భంగా రెండు ద్విచక్రవాహనాలపై అనుమానాస్పదంగా వెళుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రదీప్, జగేశ్వర్ ను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. చోరీ చేసినట్లు అంగీకరించారన్నారు. రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News April 17, 2026
ఆదిలాబాద: విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఐటీడీఏ పీవో

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరిగిందని పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐటీడీఏ ఆధ్వర్యంలో 16 పాఠశాలలను విద్య ప్లస్ పాఠశాలలుగా మార్చి ఎంపికైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం జరుగుతుందన్నారు.
News April 17, 2026
ఆదిలాబాద్: మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ షురూ

ఆదిలాబాద్ మున్సిపాలిటిలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నలుగురు సభ్యులను ఎన్నుకునేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో ఇద్దరు మైనారిటీలు, ఇద్దరు ఇప్పటికే కౌన్సిలర్లుగా పని చేసిన వారిని ఎన్నుకొనగా.. రెండు విభాగాల్లో ఒక మహిళ సభ్యురాలు ఉండనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 25లోపు పూర్తి వివరాలను సమర్పించాలని కమిషనర్ రాజు తెలిపారు.
News April 17, 2026
ఆదిలాబాద్: DOST HELP LINE సెంటర్

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత తెలిపారు. ఈ నెల 15న మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. ఆధార్, ఫోన్, ధ్రువపత్రాలతో రావాలన్నారు.


