News February 9, 2025
నేడు బీఆర్ఎస్ ‘బీసీ’ సమావేశం
TG: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాడాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై ఇవాళ బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ ‘బీసీ’ సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే ఈ భేటీలో కులగణన సర్వే నివేదిక, 42% రిజర్వేషన్ అమలుతో పాటు ఇతర సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News February 9, 2025
‘ఏకగ్రీవాలకు’ ఎన్నికల సంఘం చెక్!
TG: ‘స్థానిక’ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏకగ్రీవాలు లేకుండా ఒక్క నామినేషన్ నమోదైనా ‘నోటా’ను రెండో పోటీదారుగా పేర్కొంటూ ఎన్నిక నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ విధానం ఇప్పటికే హరియాణా, MHలో అమల్లో ఉంది. దీనిపై ఈనెల 12న రాజకీయ పార్టీలతో చర్చించనుంది. అయితే పార్టీలు ఓకే చెప్పినా ప్రభుత్వం అంగీకరిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.
News February 9, 2025
ఢిల్లీ అసెంబ్లీలో తగ్గిన మహిళల సంఖ్య
ఢిల్లీ అసెంబ్లీలో మహిళల సంఖ్య తగ్గింది. గత ఎన్నికల్లో 8మంది ఎమ్మెల్యేలుగా గెలవగా ఈసారి ఐదుగురే విజయం సాధించారు. వీరిలో బీజేపీ నుంచి నలుగురు ఉండగా, ఆప్ నుంచి ఆతిశీ ఉన్నారు. ఇక మొత్తంగా గెలిచిన అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా బీజేపీ క్యాండిడేట్ కర్నాలీ సింగ్(రూ.259 కోట్లు) నిలిచారు. అత్యధిక కేసులున్న(19) ఎమ్మెల్యేగా ఆప్ నేత అమానుతుల్లా ఖాన్ ఉన్నారు.
News February 9, 2025
GOOD NEWS చెప్పిన ప్రభుత్వం
AP: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అర్హులైన వారి నుంచి వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2019 OCT 15 ముందు జరిగిన ఆక్రమణలకు సంబంధించే దరఖాస్తులు స్వీకరించనుండగా, లబ్ధిదారులు రుజువు పత్రాలు అందించాలి. మహిళల పేరుపై పట్టా, కన్వేయన్స్ డీడ్ అందించిన రెండేళ్ల తర్వాత ప్రభుత్వం యాజమాన్య హక్కులు ఇవ్వనుంది. 150 గజాల వరకు ఉచితంగా, ఆపై ఉంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.