News February 9, 2025
భద్రాద్రిలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. 21 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇటీవల భద్రాచలం కొత్తగా ఏర్పడడంతో సంఖ్య 22కు చేరింది. గతంతో పోలిస్తే ఈసారి 16 ఎంపీటీసీ స్థానాలు పెరిగి 236 అయ్యాయి.
Similar News
News March 14, 2026
5 అమెరికా విమానాలపై ఇరాన్ దాడి: WSJ

ఇరాన్ మిస్సైళ్ల దాడిలో అమెరికాకు చెందిన 5 ఎయిర్ ఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ వెల్లడించింది. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో ఉన్న ఆ విమానాలపై ఇరాన్ దాడి చేసిందని పేర్కొంది. అయితే అవి పూర్తిగా ధ్వంసం కాలేదని, పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపింది. ఎవరూ మరణించలేదని వివరించింది. కాగా నిన్న ఇరాక్‌లో కూలిన అమెరికా KC-135లోని ఆరుగురు సిబ్బంది మరణించారు.
News March 14, 2026
ఇరాన్‌పై అత్యంత శక్తిమంతమైన బాంబులు వేశాం: ట్రంప్

మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన బాంబులను ఇరాన్‌లోని <<19335967>>ఖర్గ్<<>> ద్వీపంపై వేశామని ట్రంప్ ప్రకటించారు. అందులోని మిలిటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, ఆయిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను టచ్ చేయలేదని చెప్పారు. హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటే మాత్రం వెంటనే ఆ పని చేసి తీరుతామని స్పష్టం చేశారు. తన హయాంలో అమెరికా సైన్యం చాలా పవర్‌ఫుల్‌గా మారిందని, తమ దాడులను తట్టుకునే శక్తి ఇరాన్‌కు లేదన్నారు.
News March 14, 2026
హుస్నాబాద్: ఒకే బస్సులో తండ్రీకొడుకుల డ్యూటీ

హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. 34 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్న బంధనాపురం ఎల్లయ్య, ఆయన కుమారుడు ప్రేమ్(కండక్టర్) శుక్రవారం ఒకే బస్సులో కలిసి విధులు నిర్వహించారు. తండ్రి డ్రైవింగ్ చేస్తుంటే కుమారుడు టికెట్లు జారీ చేయడం ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంది. ఒకే వృత్తిలో ఉంటూ ఇలా ఒకే బస్సులో డ్యూటీ చేయడంపై తోటి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.


