News February 9, 2025

రోహిత్ ఫామ్‌పై ఆందోళన లేదు: బ్యాటింగ్ కోచ్

image

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి తమకు ఆందోళన లేదని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. ‘రోహిత్‌కు వన్డేల్లో 31 సెంచరీలున్నాయి. గత వన్డే సిరీస్‌లో(vsSL) 56, 64, 35 పరుగులు చేశాడు. టెస్టుల్లో విఫలమయ్యాడు కానీ వన్డేల్లో రన్స్ చేస్తూనే ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌తో మాకు ఏ సమస్యా లేదు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.

Similar News

News February 10, 2025

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

image

TG: సెలవు దినాల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టొద్దని హైడ్రాకు హైకోర్టు సూచించింది. శుక్రవారం నోటీసులిచ్చి, వివరణ ఇచ్చేందుకు శనివారం ఒక్కరోజే సమయమిస్తూ ఆదివారం కూల్చివేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి(D) అబ్దుల్లాపూర్‌మెట్(M) కోహెడలో నిర్మాణాల కూల్చివేతలపై నమోదైన పిటిషన్‌ను విచారించింది. వివరణ ఇచ్చేందుకు భవన యజమానులకు సహేతుకమైన సమయం ఇవ్వాలని పేర్కొంది.

News February 10, 2025

షమీ భాయ్.. ఇలా అయితే ఎలా?

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు IND బౌలర్ షమీ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ పేసర్ స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. ENGతో తొలి ODIలో 8 ఓవర్లు వేసి 38/1తో ఫర్వాలేదనిపించినా, రెండో వన్డేలో 7.5 ఓవర్లకే 66 రన్స్ సమర్పించుకున్నారు. అనుకున్న లైన్, లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోతున్నారు. CTకి బుమ్రా దూరమయ్యే ఛాన్సున్న నేపథ్యంలో షమీ ఫామ్‌లోకి రావడం ముఖ్యమని విశ్లేషకులు అంటున్నారు.

News February 10, 2025

మంచి మాట – పద్యబాట

image

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనసు నిర్మలంగా లేనట్లయితే ఆచారాలు పాటించడం వల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రంగా లేని వంట, మనసు స్థిరంగా లేని శివ పూజ వ్యర్థాలే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.

error: Content is protected !!