News February 9, 2025

సీట్ల తేడా ఎక్కువున్నా ఓట్ల వ్యత్యాసం తక్కువే!

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AAP మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువే ఉంది. BJPకి 45.56% పోలవగా ఆప్‌కు 43.57% వచ్చాయి. కానీ సీట్ల తేడా మాత్రం 26 స్థానాలుగా ఉంది. కాషాయ పార్టీ 48 స్థానాలను గెలుచుకోగా ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ముగ్గురు అభ్యర్థులూ ‘చీపురు’ పార్టీకి చెందినవారే కాగా అత్యల్ప మెజార్టీతో విజయం సాధించిన చివరి ముగ్గురూ కమలం అభ్యర్థులే కావడం గమనార్హం.

Similar News

News February 9, 2025

రేపటి నుంచి ‘భాగ్యనగర్’ బంద్

image

TG:ఉత్తర తెలంగాణ వాసుల వరప్రదాయిని భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ 11 రోజుల పాటు నిలిచిపోనుంది. 3వ లైన్ పనుల కారణంతో సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య నడిచే ఈ రైలు రాకపోకలను ఈ నెల 10 నుంచి 21 వరకు నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, పొత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్ వరకు దీనిలో నిత్యం ప్రయాణించేవారుంటారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు తిప్పలు తప్పవు.

News February 9, 2025

బీజేపీ బలోపేతానికి కారణమే మీరు.. కేటీఆర్‌కు కోమటిరెడ్డి కౌంటర్

image

TG: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో రాహుల్ గాంధీకి <<15396872>>అభినందనలు<<>> తెలిపిన కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం సొంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం ఆయనదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికి బీఆర్ఎస్సే కారణమని కోమటిరెడ్డి ఆరోపించారు.

News February 9, 2025

16 నుంచి పెద్దగట్టు జాతర

image

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల(మ) దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి 20 వరకు ఇది జరగనుంది. మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి లక్షల మంది వస్తారు. అటు జాతరకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

error: Content is protected !!