News March 19, 2024

HYD: ధర్మ సమాజ్ పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం

image

ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించి తెలంగాణలోని వివిధ పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జులను పార్టీ అధ్యక్షుడు డా.విశారదన్ మహారాజ్ మంగళవారం ప్రకటించారు. మెదక్- అన్నెల లక్ష్మణ్, భువనగిరి-దుర్గాప్రసాద్, సికింద్రాబాద్-వినోద్ కుమార్, చేవెళ్ల-రాఘవేంద్ర ముదిరాజ్, కరీంనగర్- చిలువేరు శ్రీకాంత్, నిజామాబాద్-కండెల సుమన్, హైదరాబాద్- గడ్డం హరీశ్ గౌడ్, వరంగల్ – మేకల సుమన్, మహబూబాబాద్ -రవ్వ భద్రమ్మ, మహబూబ్ నగర్ -రాకేష్.

Similar News

News April 18, 2026

HYDలో నేడు వీటిలోకి ఫ్రీ ఎంట్రీ

image

హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలు, సాలార్జంగ్ మ్యూజియం సందర్శనకు నేడు ఫ్రీ ఎంట్రీ. నేడు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ అవశాన్ని నగరవాసులకు కల్పించింది. సాలార్జంగ్ మ్యూజియం, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ, పబ్లిక్ గార్డెన్స్, భువనగిరి ఫోర్ట్‌ను అందరూ ఫ్రీగా సందర్శించొచ్చు. మరిన్ని వివరాలకు గన్ ఫౌండ్రీలోని కార్యాలయాన్ని లేదా 040-23234942 నం.లో సంప్రదించొచ్చు.

News April 18, 2026

సికింద్రాబాద్ రక్షక శక్తికి 200 ఏళ్ల వైభవం

image

HYD సంస్థానంలో 1813లో కలరా మహమ్మారి విజృంభించిన సమయంలో అప్పయ్య చేసిన పవిత్ర మొక్కు నుంచి నేటి లష్కర్ బోనాల వైభవం వరకు ఉజ్జయిని మహంకాళి దేవాలయం అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. 1815లో కొయ్య విగ్రహంతో ప్రారంభమైన ఈ చారిత్రక క్షేత్రం, నగర ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సాంస్కృతిక గౌరవాన్ని కాపాడుతూ కోట్లాది మంది భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. అమ్మవారి దయుంటే అన్నీ జరిగుతాయని భక్తుల విశ్వాసం.

News April 18, 2026

HYD: పోలీసులకు లొంగిపోయిన మాజీ MLA కొడుకు

image

హిట్& రన్ కేసులో మాజీ MLA షకీల్ కుమారుడు రాహెల్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2022లో బెలూన్లు అమ్మే మహిళ కాజోల్ చౌహాన్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రోడ్డు దాటుతుండగా MLA స్టిక్కర్ ఉన్న షకిల్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ చేతిలో ఉన్న శిశువు కిందపడి మృతిచెందింది. ఆమె తీవ్రంగా గాయపడింది. హిట్& రన్ ఘటనలో నిందితుడిగా ఉన్న రాహెల్ పరారీలో ఉండగా, కోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.