News February 9, 2025
అరకు: మన్యం బంద్‌కు సీపీఎం మద్దతు

మన్యం బంద్ ఫిబ్రవరి 11, 12 తేదిల్లో జరుగనున్నది. దానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని అరకులోయ సీపీఎం మండల కార్యదర్శి రామారావు తెలిపారు. ఈ మేరకు ఆయన మన్యం బంద్ జయప్రదం చేయాలని ఆదివాసి గిరిజన సంఘం అఖిలపక్ష ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు విస్తృతంగా పంచారు. ఆదివాసిల 1/70 చట్టాన్ని సవరించాలని రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
Similar News
News July 4, 2025
విశాఖలో ఏడో తరగతి బాలికపై అత్యాచార యత్నం

రణస్థలం ప్రాంతానికి చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ రేసపువానిపాలెం వినాయకనగర్ వద్ద నివాసం ఉంటున్నాడు. తన ఇంటి కింద నివసిస్తున్న ఏడో తరగతి చదువుతున్న బాలికను గదికి రప్పించి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ట్రీ టౌన్ పోలీసులు నిందితుడిని రిమాండ్‌కి తరలించారు.
News July 4, 2025
లక్ష్మీ బ్యారేజీలో గోదావరి నదికి వరద తగ్గుముఖం

మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీలో గోదావరి నదికి శుక్రవారం సాయంత్రం నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా భారీగా వరద ఉద్ధృతి నెలకొనగా.. శుక్రవారం ఉదయం 84,500 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. సాయంత్రం 6 గంటలకు 72,500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.
News July 4, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో 2025 డీఏ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం 55శాతం డీఏను 59శాతానికి పెంచుతారని తెలుస్తోంది. జులై నుంచే ఈ పెంపు అమల్లోకి రానుండగా, బకాయిలు మాత్రం 2026 జనవరి 1 తర్వాతే చెల్లిస్తారని సమాచారం. రానున్న 2 నెలల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు సార్లు జనవరి, జులైలో డీఏను సవరిస్తారు.