News February 9, 2025

విజయవాడ: గుణదల తిరునాళ్లకు వచ్చేవారికి గుడ్ న్యూస్ 

image

మేరీ మాత ఉత్సవాలకు వచ్చేవారికై రామవరప్పాడులో కింది రైళ్లకు ఆదివారం నుంచి మంగళవారం వరకు స్టాప్ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. నం.67257 విజయవాడ-నరసాపురం, నం.67258 మచిలీపట్నం-విజయవాడ రైళ్లకు రామవరప్పాడులో స్టాప్ ఇచ్చామన్నారు. అదే విధంగా నేడు ఆదివారం నం.17482 తిరుపతి-బిలాస్‌పూర్, నం.17480 తిరుపతి-పూరి రైళ్లు రామవరప్పాడులో 10,11 తేదీలలో ఆగుతాయన్నారు. 

Similar News

News March 17, 2026

20 లక్షల ఉద్యోగాలే టార్గెట్: లోకేశ్

image

AP: పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు(APEDB) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఉద్యోగాల కల్పనే సింగిల్ అజెండాగా ఉండాలన్నారు. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని ఆదేశించారు.

News March 17, 2026

ఏప్రిల్ 15 వరకు పశువులకు గాలికుంటు టీకాలు: జేసీ

image

2030 నాటికి గాలికుంటు వ్యాధిని పూర్తిగా నియంత్రించడమే లక్ష్యమని జేసీ నిశాంతి తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌లో టీకా కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏడాదికి రెండుసార్లు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని పాడి రైతులకు సూచించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం కింద ఈ టీకాలు వేయనున్నారు.

News March 17, 2026

వికారాబాద్‌లో వరుస సెలవులు!

image

వికారాబాద్‌లో ఒక్కపూట బడులు ప్రారంభం కావడంతో పాటు మార్చి నెలలో పండుగల సెలవులు కలిసొస్తున్నాయి. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా వరుసగా సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగి, ఆ తర్వాత వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. మార్చిలోనే ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో విద్యార్థులకు వరుస విరామం దొరకనుంది. దీంతో అటు పండుగలు, ఇటు పరీక్షల సన్నద్ధతలో విద్యార్థులు నిమగ్నమయ్యారు.