News February 9, 2025

కాళేశ్వరంలో నేటి కార్యక్రమాల వివరాలు

image

కాళేశ్వరంలో మహా కుంభాభిషేకం వైభవంగా సాగుతోంది. చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఇప్పటికే తుని తపోవన పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామివారు కాళేశ్వరానికి చేరుకున్నారు. ప్రాత: సూక్త మంత్ర పఠనం, ప్రాత:కాల పూజలు, రుద్రహవనం, జయాదులు, బలిప్రధానము, మహా పూర్ణాహుతి, ఉం.10:42 నిమిషాలకు మహా కుంభాభిషేకం, హారతి, మంత్ర పుష్పం, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద వినియోగములు అనంతరం మహా అన్నప్రసాద వితరణ ఉంటుంది.

Similar News

News March 20, 2026

ADB: ‘హాప్ వైఫ్’ సంస్కృతి మళ్లీ మొదలైందా..?

image

అమ్మాయిల <<19431469>>అక్రమ రవాణాలో<<>> ASF, ఉట్నూరు, ఖానాపూర్ ప్రాంతాలే టార్గెట్‌గా మారాయి. 2016లో తిర్యాణికి చెందిన ఓ 14 ఏళ్ల బాలికను తరలించే ప్రయత్నాన్ని మహారాష్ట్రలో పోలీసులు భగ్నం చేశారు. 2021లో కెరమెరిలో జరిగిన మరో ఘటనలో నిందితులు అరెస్టయ్యారు. కాగా గతంలో బయటపడిన బాధితులు ‘హాఫ్ వైఫ్’ సంస్కృతి పేరిట సామూహిక అత్యాచారాల బారిన పడ్డామని వెల్లడించారు. తాజాగా బెజ్జూర్‌ ఘటన వెలుగులోకి రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

News March 20, 2026

WGL: 29న ప్రభుత్వ పాలిటెక్నిక్ 70 ఏళ్ల వేడుకలు

image

వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 29న ప్లాటినం జూబ్లీ వేడుకలను నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యే పూర్వ విద్యార్థులందరూ తమ పేర్లను ఈ నెల 22లోపు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. పాత విద్యార్థులందరూ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News March 20, 2026

NGKL: అంతరించే దశలో అరుదైన కప్పలు

image

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అడవుల్లో ఒకప్పుడు సందడి చేసిన ‘కామన్ ట్రీ ఫ్రాగ్’ (చెట్టు కప్పల) సంఖ్య ఆందోళనకరంగా తగ్గుతోంది. పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషించే ఈ కప్పలు అటవీ నరికివేత, నీటి వనరుల కొరత, పురుగుమందుల మితిమీరిన వాడకం వల్ల అంతరించిపోతున్నాయని బయోలాజిస్ట్ రవికాంత్ తెలిపారు. ఈ అరుదైన కప్పలను కాపాడుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నేడు అంతర్జాతీయ కప్పల దినోత్సవం.