News February 9, 2025
నేడు ఆత్మకూరుకు రానున్న ఐదుగురు మంత్రులు

నేడు(ఆదివారం) ఆత్మకూరులో ఐదుగురు మంత్రుల బృందం పర్యటిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. మంత్రులు ఫరూక్, సవిత, బీసీ జనార్దన్, నారాయణ వారిలో ఉన్నారు. టిడ్కో నివాస ప్రాంతాల్లో సీతారామ ఆలయ నిర్మాణం, పంచాయతీరాజ్ నూతన అతిథి భవన నిర్మాణానికి శంకుస్థాపన, R&B నూతన అతిథిగృహ ప్రారంభం, జ్యోతిరావు ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను వారు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Similar News
News March 3, 2026
నెల్లూరు: స్పెషల్ డ్రైవ్ పెడుతున్నా.. శృతి మించుతున్నారు

జిల్లాలో పోలీసులు ఎప్పటికప్పుడు నాకా బందీలు చేపడుతున్నా.. ఎక్కడికక్కడ శృతి మించుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల చేపట్టిన పలు సందర్బల్లో కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా.. 57 లాడ్జిలను, 1694 వాహనాలను తనిఖీ చేయగా.. 20 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో 28 మంది పట్టుబడ్డారు. నిభందనలు పాటించనివారిపై 157 కేసులు నమోదు చేశారు. రూ. 1.52 లక్షలు జరిమానా విధించారు.
News March 2, 2026
నెల్లూరు: చికిత్స పొందుతూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

కోవూరు(m), పాటూరుకు చెందిన పవన్ సాయి(19) గంగవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 27న తన ఇంట్లోనే గడ్డి ముందు సేవించాడు. వాంతులు రావడంతో గమనించిన తండ్రి చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 2, 2026
‘నెల్లూరు కలెక్టర్ చొరవతో నా ఇల్లు నాకు వచ్చిందయ్యా’

‘కలెక్టర్ బాబు చొరవతో నా ఇల్లు నాకు వచ్చిందయ్యా’ అంటూ కావలికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలు ధన్యవాదాలు చెప్పేందుకు ప్రత్యేకంగా కలెక్టరేట్‌కు వచ్చారు. 2025 సెప్టెంబర్ 22న నడవలేని స్థితిలో ఉన్న రమాజ్యోతి కలెక్టరేట్‌కి వచ్చింది. కలెక్టర్ ఆమె సమస్యను అడిగి తెలుసుకొని పరిష్కారం చూపారు. కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన తొలి PGRSలో అందిన మొదటి అర్జీ ఇదే కావడం విశేషం.


