News February 9, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై పీఓ, ఎపీఓలకు శిక్షణ

ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సిబ్బంది విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో ఫిబ్రవరి 27న నిర్వహించబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పీఓ, ఎపీఓలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరాజు, డీటీ వేణు, ఎలక్షన్ ట్రైనర్స్ రమేశ్, వెంకటేశ్వర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 24, 2026
పెంచికల్ పేట్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

పెంచికల్ పేట్ మండలంలో కలెక్టర్ హరిత మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీలో హాజరు, మెను, వంటగది పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. బొంబాయిగూడా అంగన్వాడిలో గర్భిణీలకు పోషకాహారం అందించాలన్నారు.
News March 24, 2026
RGM: NTPCలో 91% విద్యుత్ ఉత్పత్తి: ED

రామగుండం NTPCలో 2025- 26 ఆర్థిక సంవత్సరంలో 91% విద్యుత్ ఉత్పత్తి సాధించామని ప్లాంట్ EDచందన్ కుమార్ సమంతా అన్నారు. NTPC- EDCబిల్డింగ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో EDమాట్లాడుతూ ఇప్పటికే 100MWసోలార్ పవర్, 100MWఫ్లోటింగ్ సోలార్, 72MW గ్రౌండ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పరిశ్రమలకు సంబంధించిన కాలుష్య నివారణకు యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
News March 24, 2026
ధర్మారం: ఆరేళ్ల బాలుడి నేత్రదానం.. ఇద్దరికి చూపు

ధర్మారం మండలం కటికనపల్లికి చెందిన బొజ్జ సంపత్ కుమారుడు అభిరామ్(06) విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని డా. విద్యాసాగర్ నేత్రదానంపై చైతన్య పరిచారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి డా. భీష్మాచారి ఆధ్వర్యంలో బాబు కనుపాపలను సేకరించి హైదరాబాద్ ఐ బ్యాంక్‌కు పంపారు. మరణంలోనూ అభిరామ్ ఇద్దరు వ్యక్తులకు చూపునిచ్చి ఆదర్శంగా నిలిచాడు.


