News February 9, 2025
పెన్‌పహాడ్: హిందీ ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తులు

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం అనాజిపురం ఆదర్శ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కోడి లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి -10వ తరగతి వరకు గంటల ప్రతిపాదికన బోధించేందుకు అర్హత, అనుభవం కలిగిన వారు ఈనెల 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు సెల్ 99896 36205కు సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 22, 2026
పాడేరు: స్టీల్ ప్లాంట్‌పై విస్తృత ప్రచారం

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. శనివారం పాడేరులో టీడీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో 60 వేల మందికి ఉపాధి లభిస్తుందని, ముఖ్యంగా గిరిజన యువతకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె వివరించారు.
News March 22, 2026
వారంలో 10% తగ్గిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. గతవారంలో బంగారం ధర 10% తగ్గింది. 2011 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, డాలర్ బలోపేతం కావడం వల్ల ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో శుక్రవారం బంగారం ఔన్సు ధర 4,492 డాలర్లకు చేరింది. వెండి కూడా వారం రోజుల్లో 15% దిగొచ్చింది. దేశీయంగా MCXలో 10 గ్రాముల బంగారం ధర ₹1,44,825కు పడిపోగా కిలో వెండి ₹2,27,470 వద్ద ముగిసింది.
News March 22, 2026
HYD: రేపటి నుంచి లైఫ్ ట్యాక్స్ రద్దు

అదనపు వాహనాలు కొనుగోలు చేసే వారికి పడే 2% లైఫ్ ట్యాక్స్‌ను ఈ నెల 23 నుంచి రద్దు చేస్తున్నట్లు HYDలోని అధికారులు తెలిపారు. ఈ మేరకు వాహన్ పోర్టల్ అందుబాటులోకి రానుందని అన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారని దీని ద్వారా దేశంలో ఉన్న అన్ని వాహనాల వివరాలు ఒకే గొడుగు కిందికి రానున్నాయని వెల్లడించారు. 2% పన్ను ఎత్తివేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
# SHARE IT


