News February 9, 2025

కరీబియన్ సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

image

హోండురస్‌కు ఉత్తర దిక్కున కరీబియన్ సముద్రంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. సముద్రానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని జర్మన్ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ సంస్థ తెలిపింది. ఈ ప్రాంతంలో 2021 తర్వాత ఇదే అతి పెద్ద భూకంప తీవ్రత కావడంతో కరీబియన్ సముద్రం చుట్టపక్కల ఉన్న హోండురస్, ప్యూర్టోరికో, వర్జిన్ ఐలాండ్స్‌కు అమెరికా సముద్ర, పర్యావరణ పరిశీలన సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

Similar News

News March 19, 2026

CSKకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం

image

మరో 9 రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుండగా CSK జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్(AUS) గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని CSK CEO విశ్వనాథన్ తాజాగా ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఆయన స్థానంలో వేరే బౌలర్ కోసం చూస్తున్నామన్నారు. డెత్ ఓవర్లలో ఎల్లిస్ కీలక బౌలర్ అని, ఆయన దూరమవడం తమకు పెద్ద దెబ్బ అని విశ్వనాథన్ పేర్కొన్నారు.

News March 19, 2026

ఇరాన్ ఆ కేబుల్స్ కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్!

image

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంటర్నెట్ కనెక్షన్లనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. హార్ముజ్, బాబ్-ఎల్-మాండెబ్ జలసంధుల కింద పెద్ద ఎత్తున డేటా కేబుల్స్ ఉన్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను లింక్ చేస్తున్నాయి. యుద్ధంలో భాగంగా ఇవి ధ్వంసమైతే మనకు ఇబ్బందులు తప్పవు. 2024లో హౌతీల దాడుల సమయంలో ఇదే జరిగింది. పైగా మిలిటరీ యాక్టివిటీ వల్ల వాటిని రిపేర్ చేయడానికి నెలల సమయం పట్టింది.

News March 19, 2026

ఈరోజు నమాజ్ వేళలు (17-3-2026) మంగళవారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:23 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.