News March 19, 2024
ఒక్క రోజు కామెంట్రీకి రూ.25 లక్షలు
క్రికెట్ మ్యాచులో కొందరు మాజీ ఆటగాళ్ల కామెంట్రీలు ఎప్పటికీ ప్రత్యేకమే. భారత్ నుంచి రవిశాస్త్రి, సిద్ధు, సెహ్వాగ్ ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా సిద్ధూ కామెంటరీ బాక్స్‌లో తనదైన శైలిలో వేసే ఛలోక్తులు నవ్వులు పూయిస్తాయి. ఈ IPL సీజన్‌కు కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇస్తున్న సిద్ధు తన ఫీజు ఎంతో వెల్లడించారు. ఐపీఎల్‌లో రోజుకు రూ.25 లక్షలు తీసుకుంటున్నానని తెలిపారు.
Similar News
News November 25, 2024
యానిమల్‌లో హింస.. స్పందించిన రణ్‌బీర్
యానిమల్ మూవీలో హింసను ప్రధానంగా చూపించారన్న ఆరోపణలపై ఆ మూవీ హీరో రణ్‌బీర్ కపూర్ ఓ ఈవెంట్‌లో స్పందించారు. ‘ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. కళాకారులు సమాజహితమైన సినిమాలు చేయాలి. అది మా బాధ్యత. కానీ నటుడిగా వివిధ రకాల జానర్లలో వివిధ పాత్రల్ని నేను పోషించాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు. తన తాత రాజ్‌కుమార్ జీవితంపై బయోపిక్ తీసేందుకు యోచిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
News November 25, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 25, 2024
IPL వేలంలో ఖరీదైన ప్లేయర్లు
* పంత్- రూ.27కోట్లు (లక్నో, 2025)
* శ్రేయస్ అయ్యర్-రూ.26.75కోట్లు (పంజాబ్, 2025)
* స్టార్క్-రూ.24.75కోట్లు (కోల్‌కతా, 2024)
* కమిన్స్-రూ.20.50కోట్లు (SRH, 2023)
* శామ్ కరన్-రూ.18.50కోట్లు (పంజాబ్, 2023)
* అర్షదీప్ సింగ్-రూ.18కోట్లు (పంజాబ్, 2025)
* కామెరూన్ గ్రీన్-రూ.17.50కోట్లు (ముంబై, 2023)
* బెన్ స్టోక్స్-రూ.16.25కోట్లు (చెన్నై, 2023)
* క్రిస్ మోరిస్-రూ.16.25కోట్లు(రాజస్థాన్, 2021)