News February 9, 2025

బాపట్ల జిల్లా ప్రముఖ గాయని మృతి

image

బాపట్ల మండలం నరసాయపాలేనికి చెందిన ప్రముఖ గాయని కారుమంచి కోటిరాజ్(88) శనివారం మృతి చెందారు. ఈమె సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేశారు. ఈమె ఏడేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారు. సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఆమె పలు సినిమాలకు పాటలు కూడా పాడారు. బాపట్ల జమేదారుపేటలో 27ఏళ్ల క్రితం స్థిరపడి సప్తస్వర సంగీత కళాశాల ఏర్పాటు చేసి, అనేకమందికి సంగీతం నేర్పించారు.

Similar News

News March 13, 2026

KNR: బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’కు సవాళ్లు!

image

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈనెల 14న చేపట్టనున్న ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’లో భాగంగా KNR నుంచి కొండగట్టు వరకు సాగే 40 కి.మీ పాదయాత్రపై భానుడి ప్రతాపం, ట్రాఫిక్ చిక్కుల ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఆరోజు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించడం, అదే రోజు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు సవాలుగా మారనున్నాయి. దీంతో యాత్ర సాగే తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News March 13, 2026

కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

image

కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆకుగూడు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు కంది మొక్కల చిగురు ఆకులను గూడుగా చేసి, లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్‌ఫాస్‌ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్‌ 36% యస్‌.యల్‌ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News March 13, 2026

గిరిజనులకు పక్కా ఇళ్లు.. పురోగతిపై వివరణ కోరిన MP

image

గిరిజన కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం పురోగతిపై ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి గురువారం లోక్ సభలో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎంజేయూజీఏ కింద ST కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రాలవారి పురోగతి, అర్హులైన గిరిజన కుటుంబాలను ఎలా గుర్తిస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి దుర్గాదాస్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.