News February 9, 2025

GBS కలకలం.. రాష్ట్రంలో తొలి మరణం

image

తెలంగాణలో తొలి GBS(గిలియన్ బార్ సిండ్రోమ్) <<15404745>>మరణం <<>>సంభవించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళ ప్రాణాలు విడిచింది. సిద్దిపేట సమీపంలోని సీతారాంపల్లికి చెందిన వివాహిత(25) నెల రోజుల క్రితం నరాల నొప్పులతో స్థానిక ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత HYD నిమ్స్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. నిన్న చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

Similar News

News February 10, 2025

ఇలాంటి మోసం చూడలేదయ్యా!

image

విమానాల్లో విండో సీట్‌కు డిమాండ్ ఎక్కువ. అయినప్పటికీ చాలామంది ఇష్టంతో ఎక్కువ డబ్బులైనా చెల్లించి విండో సీటు బుక్ చేసుకుంటుంటారు. అలానే బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి ఇండిగో ఎయిర్‌లైన్ షాక్ ఇచ్చింది. అసలు కిటికీనే లేని విండో సీటు ఇచ్చారంటూ అతను చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. అతడు తమిళ స్టార్ స్పోర్ట్స్‌లో క్రికెట్ కామెంటేటర్ కావడంతో ట్వీట్ ట్రెండ్ అవుతోంది.

News February 10, 2025

అరుదైన సన్నివేశం.. ఫీల్డింగ్ చేసిన కోచ్

image

క్రికెట్‌లో ఓ అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. కివీస్‌తో వన్డే సందర్భంగా SA ఫీల్డింగ్ కోచ్ వండిలే గ్వావు గ్రౌండులో ఫీల్డింగ్ చేశారు. గాయపడిన ఓ ఆటగాడి స్థానంలో ఆయనే బరిలోకి దిగారు. SA20 టోర్నీ సందర్భంగా ప్లేయర్లు అంతర్జాతీయ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. 13 మందితోనే ఆ జట్టు ట్రైసిరీస్‌ కోసం పాక్‌ పర్యటనకు వచ్చింది. కాగా 2024లో బ్యాటింగ్ కోచ్ డుమినీ కూడా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేశారు.

News February 10, 2025

‘నమస్కారం’.. వివిధ రాష్ట్రాల్లో ఇలా!

image

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ- నమస్కారం, అరుణాచల్- జైహింద్, అసోం- నొమొస్కార్, బిహార్- ప్రణామ్, గుజరాత్- జై శ్రీకృష్ణ, హరియాణా- రామ్ రామ్, ఝార్ఖండ్ – జోహార్, కర్ణాటక- నమస్కార, కేరళ- నమస్కారం, MP- నమస్తే, MH- నమస్కార్, మణిపుర్ – కురుమ్జరి, మిజోరం – చిబాయ్, నాగాలాండ్ – కుక్నలిమ్, ఒడిశా- నమస్కార్, పంజాబ్ – సత్ శ్రీ అకల్, రాజస్థాన్ – రామ్ రామ్, TN – వనక్కం, యూపీ- రాధే రాధే, వెస్ట్ బెంగాల్ – నమొష్కార్.

error: Content is protected !!