News February 9, 2025
చిత్తూరు: రెండు రోజుల క్రితం పెళ్లి.. ఇంతలోనే
రెండు రోజుల క్రితం పెళ్లి.. కొత్త దంపతులతో సహా పలువురు వధువు ఇంటికి విందుకు బయలుదేరారు. సరదాగా సాగుతున్న వారి ప్రయాణాన్ని లారీ రూపంలో వచ్చిన ప్రమాదం ఛిద్రం చేసింది. GDనెల్లూరు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. యాదమరి(M) దళితవాడకు చెందిన రామన్‌కు కవితతో శుక్రవారం పెళ్లి జరిగింది. శనివారం వారు ఆటోలో వధువు ఇంటికి వెళుతుండగా లారీ ఢీకొట్టింది. 13 మంది గాయపడగా ఒకరు మృతి చెందారు.
Similar News
News February 10, 2025
చిత్తూరు సమీపంలో బాంబ్ బ్లాస్ట్.. ఒకరు మృతి
చిత్తూరు సమీపంలో బాంబ్ పేలి ఒకరు చనిపోయారు. ఉయ్యాల చింత వద్ద రోడ్డు పనుల్లో భాగంగా బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈక్రమంలో ఒక్కసారిగా బాంబ్ పేలింది. అక్కడే పనిచేస్తున్న అంజు స్పాట్లోనే చనిపోయారు. యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 10, 2025
RCపురం: చెరువులో పడి యువకుడి మృతి
ప్రమాదవశాత్తు యువకుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుపతి(D) రామచంద్రాపురం(M) రాయలచెరువుపేటకు చెందిన లోకేశ్(23) స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శనివారం స్కూల్ అయిపోయిన తర్వాత బైకుపై రామచంద్రాపురం నుంచి ఇంటికి బయల్దేరారు. ప్రమాదవశాత్తు రాయలచెరువులో పడిపోయాడు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా చెరువులో మృతదేహాన్ని గుర్తించారు.
News February 10, 2025
తిరుమల కల్తీ నెయ్యి సరఫరాలో నలుగురు అరెస్టు.. ఏ1 ఎవరో ..?
తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో నలుగురు కీలక నిందితులను సిట్ ఆదివారం రాత్రి అరెస్ట్ చేసింది. బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు ఏ4 విపిన్ జైన్, ఏ3 పోమిల్ జైన్, వైష్ణవి డెయిరీ సీఈవో వినయ్ కాంత్, ఏ2 ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్‌లను అరెస్ట్ చేశారు. ఏ1 నిందితుడెవరో ఇంకా నిర్ధారించలేదు. టీటీడీలో పనిచేసిన కీలక అధికారి లేదా బోర్డులోని కీలక వ్యక్తిని కేసులో చేర్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.