News February 9, 2025
భువనగిరి: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను నేటి నుంచి 20వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు ప్రయాణించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట – ఖమ్మం – విజయవాడ మధ్య మూడో ట్రాక్ లైన్ పనుల కారణంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు, ప్రజలు గమనించగలరని కోరారు.
Similar News
News February 10, 2025
’మహామండలేశ్వర్‘ పదవికి మమత రాజీనామా
తాను కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ నటి మమతా కులకర్ణి ప్రకటించారు. ఇకపై సాధ్విగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. కాగా 90ల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న మమత ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకున్నారు. ఓ డ్రగ్స్ రాకెట్‌లోనూ ఆమె పేరు వినిపించింది. ఇటీవల మహాకుంభమేళాలో ఆమె కిన్నర్ అఖాడాలో చేరి సన్యాసినిగా మారారు. కానీ దీనిపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
News February 10, 2025
దొంగతనాలకు పాల్పడిన 5గురు అరెస్ట్
ఏలూరు, పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన 5గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 13 కేజీల వెండి,186 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్, 3 టౌన్ సీఐ కోటేశ్వరరావు, కైకలూరు సీఐ కృష్ణ 3 టౌన్ ఎస్ఐ ప్రసాద్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.
News February 10, 2025
అత్యధిక ఫాలోవర్లున్న ఇన్‌స్టా అకౌంట్స్ ఇవే
ఇన్‌స్టాగ్రామ్-685 మిలియన్లు
క్రిస్టియానో రొనాల్డో – 649 మిలియన్లు
లియోనెల్ మెస్సీ – 505 మిలియన్లు
సెలీనా గోమెజ్- 422 మిలియన్లు
డ్వేన్ జాన్సన్ (రాక్) – 395 మిలియన్లు
కైలీ జెన్నర్ – 394 మిలియన్లు
అరియానా గ్రాండే – 376 మిలియన్లు
*ఇండియాలో విరాట్ కోహ్లీ (270 మిలియన్లు) అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్నారు.