News February 9, 2025

కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు

image

KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Similar News

News November 9, 2025

రేపు ఎనుమాముల మార్కెట్ OPEN

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రేపు తిరిగి ప్రారంభం కానుండగా రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News November 9, 2025

రేపు, ఎల్లుండి కేంద్ర బృందం పర్యటన.. సీఎంతో భేటీ!

image

AP: రేపు, ఎల్లుండి రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రెండు బృందాలుగా ఏర్పడి పరిశీలించనుంది. రేపు టీం-1: ప్రకాశం, టీం-2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నష్టాలను అంచనా వేయనుంది. ఎల్లుండి టీం-1: బాపట్ల, టీం-2: కోనసీమ జిల్లాల్లో పర్యటించనుంది. ఈ కేంద్ర బృందం మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

News November 9, 2025

లారీ ఢీకొని యువకుడు మృతి

image

బైక్‌పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన భట్టిప్రోలు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ శివయ్య వివరాల మేరకు.. రేపల్లె – గూడవల్లికి బైక్‌పై వెళ్తున్న మహమ్మద్ వలి (27) ని అదే దారిలో వస్తున్న లారీ సూరేపల్లి బ్రిడ్జి వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో వలి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.