News February 9, 2025

ఖమ్మం: స్థానిక సమరానికి రె‘ఢీ’

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. తాజాగా పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సమాయాత్తమవుతోంది. ఇటీవలే మండల కేంద్రాల్లో జాబితాను రూపొందించి, ప్రదర్శించారు. జిల్లాలో 8,52,879 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ ముందస్తు పకడ్బందీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Similar News

News February 10, 2025

రఘునాథపాలెం: పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

image

ప్రజలకు ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్‌తో కలిసి, వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను సందర్శించారు. రోడ్డు నిర్మాణ పనులు రెండు వైపుల నుంచి జరగాలని, మార్చి 15 నాటికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

News February 10, 2025

ఖమ్మం: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, అనుమతి లేకుండా గైర్హాజరు అయిన అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

News February 10, 2025

ఖమ్మం: ‘దివ్యాంగుల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు’

image

దివ్యాంగుల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం దివ్యాంగులు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.

error: Content is protected !!