News February 9, 2025

మెదక్: నకిలీ బంగారంతో భారీ మోసం.. నలుగురి అరెస్ట్

image

నకిలీ బంగారం పెట్టి తూకంలో మోసం చేసిన ఘటన నర్సాపూర్‌లో జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణంలోని ముత్తూట్ మినీ ఫైనాన్స్ మేనేజర్‌గా గుండె రాజు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తనకు పరిచయం ఉన్న సురేశ్, ఆకాశ్‌లతో కలిసి నకిలీ బంగారంతో చేసి రూ.7,20,356 నగదును సంస్థ నుంచి తీసుకుని బ్యాంకును మోసం చేసి తప్పించుకున్నాడు. రీజనల్ మేనేజర్ రాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేశారు.

Similar News

News February 10, 2025

మెదక్: ఫిజిక్స్ టాలెంట్ టెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ.. ప్రశంసలు

image

జిల్లా స్థాయి ఫిజిక్స్ టాలెంట్ టెస్ట్‌లో మెదక్ విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. విజేతలకు డిఈఓ ప్రొ. రాధాకిషన్ బహుమతులు అందజేశారు. మూడు స్థానాలు పొందిన విద్యార్థులు తదుపరి నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రథమ బహుమతి సహస్ర రెడ్డి(టీజీఎంఎస్ చేగుంట). ద్వితీయ బహుమతి సిద్ర తస్లీమ్(ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మెదక్), తృతీయ బహుమతి శ్రీ చరణ్ గౌడ్(జడ్పీహెచ్ఎస్ వెల్దుర్తి) అందుకున్నారు.

News February 10, 2025

మెదక్ జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్

image

ఫోరం అఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ మెదక్ జిల్లా స్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ సోమవారం నిర్వహించారు. టాలెంట్ టెస్ట్ – 2025 క్యూఆర్ కోడ్ ద్వారా ప్రశ్నపత్రం FPST సభ్యులు విడుదల చేశారు. మెదక్ జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం ప్రతినిధులు దయానంద రెడ్డి ప్రభు, అశోక్, నాగేందర్ బాబు, దశరథం నూకల శ్రీనివాస్, కృష్ణ, మల్లారెడ్డి, మహిళా ప్రతినిధులు రజిని, నాగలత మమత, రమేష్ చౌదరి తదితరులున్నారు.

News February 10, 2025

MDK: జిల్లాలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

image

మెదక్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న గరిష్ఠంగా నర్సాపూర్ మండలంలో 35.5, వెల్దుర్తి 34.1, నిజాంపేట 33.3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

error: Content is protected !!