News February 9, 2025

జగిత్యాల: పీఎంఈజీసీ రుణాల పేరుతో మోసం.. అరెస్టు

image

ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని జగిత్యాల జిల్లాలో వేణు వర్మ అనే యువకుడు పలువురి నుంచి లక్షల్లో వసూలు చేశాడు. మంచిర్యాల జిల్లా హజీపూర్కు చెందిన వేణు వర్మను బాధితులు శనివారం JGTL పట్టణంలోని తీన్ ఖని ప్రాంతంలో పట్టుకుని జగిత్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 27, 2026

విజయవాడ: లాడ్జిలలో వ్యభిచారం

image

విజయవాడలోని గవర్నర్ పేటలో లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. ఓ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న స్థానికుల సమాచారం మేరకు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఇద్దరు విఠులను అరెస్ట్ చేసి నలుగురు మహిళలను వ్యభిచార కూపం నుంచి విడిపించినట్లు సీఐ నాగమురళి తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహిళలను సంరక్ష కేంద్రానికి పంపించామన్నారు.

News February 27, 2026

సూసైడ్ గురించి సెర్చ్ చేస్తే పేరెంట్స్‌కు అలర్ట్

image

పిల్లలు సూసైడ్ లేదా సెల్ఫ్-హార్మ్ వంటి పదాలతో ఇన్‌స్టాలో సెర్చ్ చేస్తే.. వెంటనే పేరెంట్స్‌కు అలర్ట్ వెళ్లేలా కొత్త ఫీచర్‌ వచ్చింది. పేరెంట్స్ సూపర్విజన్ టూల్స్ వాడుతున్న వారికి ఈ నోటిఫికేషన్లు వాట్సాప్ లేదా SMS రూపంలో వెళ్తాయి. ప్రస్తుతం US, UK వంటి దేశాల్లో మొదలైన ఈ ఫీచర్ 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. పిల్లలను కౌన్సెల్ చేసేలా నిపుణుల సలహాలనూ ఇన్‌స్టా అందిస్తుంది.

News February 27, 2026

బాన్సువాడ: దొంగల మూఠా అరెస్ట్

image

విద్యుత్ ట్రాన్స్‌ఫార్మల నుంచి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాల ప్రకారం.. పలు గ్రామాల్లో దుండగులు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్నారు. దర్యాప్తు చేపట్టి నిందితులు సుభాష్, కరీం, సురేఖఅర్జున్ తాంబే, సునీల్ శ్యామ్ రావు వాగ్మారేను గురువారం అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.