News February 9, 2025
జగిత్యాల: పీఎంఈజీసీ రుణాల పేరుతో మోసం.. అరెస్టు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739073471487_1259-normal-WIFI.webp)
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని జగిత్యాల జిల్లాలో వేణు వర్మ అనే యువకుడు పలువురి నుంచి లక్షల్లో వసూలు చేశాడు. మంచిర్యాల జిల్లా హజీపూర్కు చెందిన వేణు వర్మను బాధితులు శనివారం JGTL పట్టణంలోని తీన్ ఖని ప్రాంతంలో పట్టుకుని జగిత్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 10, 2025
ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘనపై నివేదికలు ఇవ్వండి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739188126662_51768855-normal-WIFI.webp)
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘనకు పాల్పడిన వారిపై తీసుకున్న చర్యలను రోజువారీ నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సీ టీమ్స్ (ఎస్ఎస్‌టీ), వీడియో సర్వేలెన్స్ టీమ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News February 10, 2025
రంగరాజన్‌పై దాడి.. స్పందించిన DCP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739192320984_81-normal-WIFI.webp)
TG:చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల జరిగిన దాడి <<15408903>>ఘటనపై <<>>రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ స్పందించారు. ‘ఇవాళ ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాం. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందిన వారు. 2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించారు. సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్‌ను కోరారు. ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు’ అని చెప్పారు.
News February 10, 2025
లోకసభ స్పీకర్‌ను అయ్యన్న ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739192540192_19090094-normal-WIFI.webp)
రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు సోమవారం ఢిల్లీలో లోకసభ స్పీకర్ ఓంబిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాల్లో రెండు రోజులపాటు ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని లోకసభ స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.