News February 9, 2025

వెంకన్న సేవలో మంత్రి సవిత

image

మంత్రి సవిత ఆదివారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆమె స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆమెకు శ్రీవారి ఆలయంలో టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.

Similar News

News December 6, 2025

TU: డిగ్రీ పరీక్షలు..149 మంది గైర్హాజరు

image

తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా కొనసాగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 29 పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన ఐదో సెమిస్టర్ రెగ్యులర్, ఆరో సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 1,931 మంది విద్యార్థులకు గాను 1,782 మంది విద్యార్థులు హాజరు కాగా 149 మంది గైర్హాజరయ్యారు.

News December 6, 2025

అనంతపురంలో రెజ్లింగ్ విజేత శ్రీ హర్షకు సన్మానం

image

ఇటీవల రెజ్లింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన శ్రీహర్షను అనంతపురంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అమర్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. నార్పల మండలానికి చెందిన బాల శ్రీహర్ష బంగారు పతకం సాధించడం జిల్లాకు గర్వకారణం అన్నారు. గుజరాత్‌లో నిర్వహించే అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు హర్ష ఎంపికయ్యారని తెలిపారు. అందులో కూడా రాణించాలని ఆకాంక్షించారు.

News December 6, 2025

VJA: దసరా ఉత్సవాల విజయవంతంపై పుస్తకావిష్కరణ

image

దసరా ఉత్సవాలను సాంకేతికతను వినియోగించుకుంటూ, అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ తెలిపారు. భక్తుల సంఖ్యను అంచనా వేసి ఇబ్బందులను అధిగమించామని పేర్కొన్నారు. పోలీసులు నిబద్ధతతో పనిచేశారని సీపీ రాజశేఖర్ బాబు చెప్పారు. దసరా లోపాలను సవరించి, భవానీ దీక్షల విరమణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.