News February 9, 2025

సన్న బియ్యం సరఫరా చేసే ఆలోచనలో ప్రభుత్వం: అనిత

image

రాష్ట్రంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సన్న రకం వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.

Similar News

News December 28, 2025

బంగ్లా ‘యాంటీ ఇండియా’ మంత్రం

image

బంగ్లాదేశ్‌లో ర్యాడికల్ స్టూడెంట్ లీడర్ హాదీ హత్యను అక్కడి ఇస్లామిస్ట్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. నిరసనలతో దేశాన్ని స్తంభింపజేస్తున్నాయి. భారత్‌, ప్రధాని మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ‘భారత వ్యతిరేక’ ధోరణి అక్కడ బలమైన శక్తిగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా ఈ భావోద్వేగాలను విస్మరించలేని పరిస్థితి.

News December 28, 2025

కాకినాడ@2025: రాజకీయ షాక్‌లు.. ప్రకృతి వైపరీత్యాలు!

image

2025లో కాకినాడ జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వైసీపికి షాక్ ఇస్తూ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది బర్డ్ ఫ్లూ, స్క్రబ్ టైఫస్ వ్యాధులు ప్రజలను భయపెట్టగా, మొంథా తుఫాన్ రైతాంగాన్ని దెబ్బతీసింది. ఆరేళ్ల తర్వాత రేషన్ షాపులు పునఃప్రారంభం కావడం, ఎస్పీ బదిలీ వంటి అంశాలు ఈ ఏడాది విశేషాలుగా నిలిచాయి.

News December 28, 2025

నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: అర్బన్‌ ఏవో

image

కామేపల్లి మండలం బాసిత్‌నగర్‌ రైతులకు సరఫరా అయిన నకిలీ విత్తనాల వ్యవహారంపై అధికారులు స్పందించారు. దీనిపై ఖమ్మం అర్బన్‌ ఏవో కిషోర్‌ వివరణ ఇస్తూ.. క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు, అధికారులు పంటను సందర్శించి నివేదిక అందజేస్తారని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా నకిలీ విత్తనాలు విక్రయించిన సంబంధిత దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.