News February 9, 2025
దారుణం: ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737718673775_1032-normal-WIFI.webp)
AP: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. కంచికచర్ల మండలంలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫొటోలు తీసి మరో ఇద్దరు స్నేహితులకు పంపించాడు. వారు ఆ ఫొటోలతో బాధితురాలిని బెదిరించారు. దీంతో వేధింపులు తాళలేక పేరెంట్స్‌తో కలిసి బాధితురాలు కంచికచర్ల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 10, 2025
టీచర్ ఉద్యోగ నియామకాల ఆలస్యం.. హైకోర్టు ఆగ్రహం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_112024/1732018822759_81-normal-WIFI.webp)
TG: DSC-2008 నియామకాల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1,382 మందిని ఇవాళ్టిలోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని <<15354548>>ఆదేశించినా<<>> అమలు చేయకపోవడంతో విద్యాశాఖపై మండిపడింది. కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాదిని హెచ్చరించింది. మూడు రోజుల్లోగా ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖ కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది.
News February 10, 2025
20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్: చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739196034426_81-normal-WIFI.webp)
AP: PM సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు CM చంద్రబాబు వెల్లడించారు. 2కిలోవాట్ల వరకు SC, STలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తామని చెప్పారు. ఈ పథకం అమల్లో బ్యాంకులూ భాగస్వామ్యం కావాలని బ్యాంకర్లతో భేటీలో CM కోరారు. ఈ పథకంతో అవసరాలకు ఉచితంగా విద్యుత్ పొందడమే కాకుండా, ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.
News February 10, 2025
కుంభమేళాలో 12 మంది జననం.. పేర్లు ఇవే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739193433195_695-normal-WIFI.webp)
మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటుచేసిన సెంట్రల్ హాస్పిటల్‌లో 12 మంది మహిళలు బిడ్డలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. అన్నీ సాధారణ కాన్పులేనని చెప్పారు. వీరిలో యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాలవారు ఉన్నారన్నారు. ఆడపిల్లలకు బసంతి, గంగా, జమున, బసంత్ పంచమి, సరస్వతి, మగ బిడ్డలకు కుంభ్, భోలేనాథ్, బజ్‌రంగీ, నంది తదితర పేర్లు పెట్టినట్లు వివరించారు.