News February 9, 2025
బాపట్ల జిల్లా ప్రజలు జాగ్రత్త..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739076344102_928-normal-WIFI.webp)
బాపట్ల జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారంలోనే మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న బాపట్ల జిల్లాలో గరిష్ఠంగా 33.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా నీరు, కొబ్బరి నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Similar News
News February 10, 2025
బాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739197412599_51768855-normal-WIFI.webp)
పిల్లల రక్షణ, సంరక్షణ ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సోమవారం కలెక్టర్ డీకే బాలాజీ, సీనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్య అధ్యక్షతన డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. బాలల రక్షణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు.
News February 10, 2025
బీటెక్ రవిని ప్రశ్నించిన విచారణాధికారి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739197265630_1041-normal-WIFI.webp)
తనని కడప జైల్‌లో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారని మాజీ మంత్రి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవిని విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ ప్రశ్నించారు. జైలులో దస్తగిరి బ్యారక్‌లో బీటెక్ రవి ఉన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరి బ్యారక్‌లోకి చైతన్య రెడ్డి వెళ్లాడా.. లేడా అని విచారణాధికారి బీటెక్ రవిని ప్రశ్నించినట్లు సమాచారం
News February 10, 2025
గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్‌గా కరుణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739196880779_60415181-normal-WIFI.webp)
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పరిశీలకురాలిగా వి.కరుణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌ను ఆమె సందర్శించారు. కలెక్టర్ నాగలక్ష్మీ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, నామినేషన్లతో పాటూ ఇతర వివరాలను ఎన్నికల పరిశీలకురాలికి కలెక్టర్ వివరించారు.