News February 9, 2025
ప్రకాశం: 17 మద్యం షాపులకు 160 దరఖాస్తులు

ప్రకాశం జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 17 మద్యం షాపులకు 160 దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసిందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అన్నారు. ఈ ధరఖాస్తుల ద్వారా రూ.2 లక్షల చొప్పున రూ.3.20 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈనెల 10న ఒంగోలులోని స్థానిక అంబేడ్కర్ భవన్‌లో లాటరీ పద్ధతిలో కలెక్టర్ షాపులు కేటాయిస్తామన్నారు.
Similar News
News April 3, 2026
కురిచేడు: శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఒకరి స్పాట్ డెత్

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన కురిచేడు మండలం పెద్దవరం గ్రామ సమీపంలో జరిగింది. పెద్దవరం గ్రామంలో నలుగురు వ్యక్తులు కారులో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న అడవిపందిని తప్పించబోయి కారు వాగులో బోల్తా కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
News April 3, 2026
ప్రకాశం: ఫొన్ సిగ్నల్స్ ద్వారా ఒకరిని కాపాడిన పోలీసులు

కందుకూరుకు చెందిన గుంటూరి మాధవరావుకు రవీంద్ర నుంచి కొంత డబ్బు రావాల్సి ఉండగా నగదు ఇవ్వాలని అడగగా రవీంద్ర స్పందించలేదు. దీంతో మనస్తాపం చెంది చనిపోతానని ఓ వీడియో బంధువులకు పంపాడు. వారు పోలీస్ కమాండ్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. CI హజరత్తయ్య వెంటనే స్పందించి మాధవరావును ఫోన్‌సిగ్నల్ ఆధారంగా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో గుర్తించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు.
News April 3, 2026
టంగుటూరు: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

కందుకూరుకు చెందిన గుంటూరి మాధవరావుకు రవీంద్ర నుంచి కొంత డబ్బు రావాల్సి ఉండగా నగదు ఇవ్వాలని అడగగా రవీంద్ర స్పందించలేదు. దీంతో మనస్తాపం చెంది చనిపోతానని ఓ వీడియో బంధువులకు పంపాడు. వారు పోలీస్ కమాండ్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. స్పందించిన CI హజరత్తయ్య వెంటనే స్పందించి మాధవరావును ఫోన్‌సిగ్నల్ ఆధారంగా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో గుర్తించారు. అనంతరం కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులు కప్పగించారు.


