News February 9, 2025

జగిత్యాల జిల్లాలో కీచక టీచర్ అరెస్ట్

image

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ టీచర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరిట 6వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లదండ్రులకు చెప్పింది. దీంతో కటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రైవేట్ ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News March 11, 2026

కడప: స్నేహితుడి కోసం పోరాటం.!

image

కడప జిల్లా మైలవరం వాసి D. జిలాని(26) సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లాడు. ఆపరేషన్ చేయాలంటే దాదాపు రూ.15 లక్షలు అవుతుందని బంధువులు తెలిపారు. దీని కోసం అతడి స్నేహితులు ప్రజలలోకి వెళ్లి సాయం కోసం అర్ధిస్తున్నారు. ‘మా స్నేహితుడిని బతికించడానికి సాయం చేయండి’ అంటూ ముందుకు సాగారు. అతడి ఆపరేషన్ కోసం దాతలు, ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నారు.

News March 11, 2026

కడప జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు ఎన్నంటే.!

image

కడప జిల్లాలో గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 5,99,802 ఉన్నాయి. ప్రభుత్వం వీటి రీఫిల్ ధరను రూ.60 పెంచింది. దీంతో జిల్లాలోని కుటుంబాలపై ఒక సిలిండర్ వినియోగానికి రూ.3.59 కోట్లు అదనపు భారం పడింది. జిల్లాలో వాణిజ్య వంట గ్యాస్ కనెక్షన్లు 4,769 ఉన్నాయి. వీటిపై రీఫిల్ ధరను రూ.144 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా చిన్న హోటళ్లు, పానిపూరీ, టీ స్టాళ్లలో డొమస్టిక్ గ్యాస్ వాడుతున్నారు.

News March 11, 2026

KNR: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లక్కీ డ్రా..!

image

KNR(D) ఇల్లందకుంట మండలంలో లక్కీ డ్రా పేరిట సాగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. రూ.3500 టికెట్‌తో రూ.90 లక్షల విలువైన ఇల్లు, నగదు బహుమతులు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ఊరిస్తున్నారు. అయితే, ఈ భారీ స్కీమ్‌కు ప్రభుత్వ అనుమతి ఉందా? లేక అధికారుల అండదండలతో సాగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనీ ల్యాండరింగ్‌కు ఆస్కారమున్న ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.