News February 9, 2025

భైంసాలో రోడ్డు ప్రమాదం.. బాలుడు మృతి

image

భైంసా మండలం వానల్‌పాడ్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న అనిల్(14)ను హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 31, 2025

5 కేజీల భారీ నిమ్మకాయలను పండిస్తున్న రైతు

image

నిమ్మకాయ బాగా పెరిగితే కోడిగుడ్డు సైజులో ఉంటుంది. అయితే కర్నాటకలోని కొడుగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి అనే రైతు భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఇవి ఒక్కోటి పెద్ద సైజులో 5 కేజీల వరకు బరువు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మైసూరు వెళ్లినప్పుడు అక్కడ మార్కెట్‌లో నిమ్మ విత్తనాలను కొని తన కాఫీ తోటలో సుబ్రమణి నాటారు. మూడేళ్ల తర్వాత నుంచి వాటిలో 2 మొక్కలకు ఈ భారీ సైజు నిమ్మకాయలు కాస్తున్నాయి.

News October 31, 2025

చిత్తూరు మేయర్ హత్య కేసు వివరాలు ఇలా..!

image

➤ హత్య జరిగిన తేది: 2015 నవంబర్ 17
➤ హత్య జరిగిన ప్రాంతం: చిత్తూరు కార్పొరేషన్ ఆఫీస్
➤ తుపాకీ కాల్పులకు అనురాధ మృతి
➤ కత్తులతో పొడవడంతో మోహన్ మృతి
➤ 130 మంది సాక్షుల విచారణ
➤ 352 సార్లు వాయిదా పడిన కేసు
➤ ఉరిశిక్ష పడింది: చింటూ(A1), వెంకట చలపతి(A2), జయ ప్రకాష్ రెడ్డి(A3), మంజు నాథ్(A4), వెంకటేశ్(A5)

News October 31, 2025

పాడేరు: మీకోసం కార్యక్రమానికి 135 ఫిర్యాదులు

image

పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో కలిసి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. మీకోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.