News March 19, 2024
HYD: లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్, AROలు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో పారదర్శకంగా, జవాబుదారీగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఉద్ఘాటించారు.
Similar News
News March 24, 2026
HYD: డీలిమిటేషన్‌తో మన గొంతు నొక్కేస్తారా?

లోక్‌సభ స్థానాల పెంపుపై TG అసెంబ్లీ నిరసన వ్యక్తం చేసింది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, నియంత్రణ పాటించిన మనకి అన్యాయం జరుగుతుందని ఏకగ్రీవ తీర్మానం చేశారు. సైబరాబాద్‌లో సీట్లు పెరిగినా, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంట్‌లో తగ్గుతుందన్నది ఆందోళన. మల్కాజిగిరి, చేవెళ్ల MP స్థానాలను విభజించే క్రమంలో మహిళా రిజర్వేషన్ 33% అమలు చేయాల్సి ఉంటుంది. దీంతో రాజకీయంగా భారీ మార్పులకు లోనుకానుంది.
News March 24, 2026
మాదాపూర్‌లో బండరాళ్ల మధ్య బతుకు పోరాటం

ఎలాంటి వసతులు లేకపోయినా పెద్దపెద్ద బండరాళ్ల మధ్యే షాపును ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతోన్న ఓ వ్యక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మాదాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో బండరాళ్ల మధ్యే చిన్న టీ దుకాణాన్ని పెట్టుకొని ఆయన తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అరకొర షెడ్డుతో, రాళ్ల పక్కనే నిత్యం కూలీలు, కార్మికులు, ఉద్యోగులకు టీ అందిస్తూ కష్టజీవిగా గుర్తింపు పొందుతున్నాడు. ఆ కష్టమే ఆయనకు తోడుగా నిలుస్తోంది.
News March 24, 2026
SC వర్గీకరణతో.. సైబరాబాద్ పాలి‘ట్రిక్స్’

సర్కార్ అమలు చేసిన SC వర్గీకరణ ఇప్పుడు సైబరాబాద్ (CURE) రాజకీయాల్లో కీలకంగా మారింది. 15% రిజర్వేషన్‌ను 3 గ్రూపులుగా విభజించారు. CUREలోని శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్‌లో జనాభా ప్రాతిపదికన వర్గీకరణ అమలవుతుంది. సెన్సస్ తర్వాత SC కోటాను మరింత పెంచే ఛాన్స్ ఉందని సర్కార్ సంకేతమివ్వడంతో ఇక్కడి రిజర్వ్‌డ్ స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల సంఖ్య పెరిగాక కొత్త సీట్లలో కొన్ని SC/STలకు కేటాయించే అవకాశం ఉంది.


