News February 9, 2025
MNCL: ఈ నెల 13 వరకు అవగాహన సదస్సులు

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 13వ తేదీ వరకు స్పర్శ్ పేరిట ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్ రాజ్ తెలిపారు. జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలన లక్ష్యంగా వైద్యులు, సిబ్బంది కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యాధి పట్ల భయాందోళన చెందకుండా నిర్భయంగా వైద్య చికిత్సలు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 17, 2026
జగిత్యాల: జీవన్ రెడ్డి అసంతృప్తి వెనుక బలమైన కారణాలు ఇవే!

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి 11 సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచారు. మూడు సార్లు మంత్రి, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. కానీ 2023 తర్వాత మంత్రి పదవి దక్కకపోవడం, MLC రెన్యూవల్ లేకపోవడం అసంతృప్తికి కారణమైంది. డా.సంజయ్‌తో కలిసి పని చేయాల్సి రావడం, మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యం లేకపోవడంతో ఇండిపెండెంట్లను గెలిపించారు. ప్రస్తుతం ఆయన తదుపరి అడుగు ఆసక్తిగా మారింది.
News March 17, 2026
మంగళగిరి: దివ్యాంగులకు రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం!

రాష్ట్రంలోని 40 శాతం వికలాంగత్వం ఉన్న దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకాన్ని ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు మంగళగిరి బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తొలుత గుంటూరులో అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వేదికను మంగళగిరికి మార్చారు. ఈ మేరకు ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పర్యవేక్షించారు.
News March 17, 2026
ఆదోని: కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

కర్నూలు జిల్లా ఆదోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రామకృష్ణపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వేటు వేశారు. మూడు రోజుల క్రితం గార్డెనియా విల్లాస్‌లోని ఓ ఇంటి ప్రహరీ పగలగొట్టి, బాధితుడు రాఘవేంద్రను భయభ్రాంతులకు గురిచేసినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. శనివారం త్రీటౌన్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో, విచారణ అనంతరం ఎస్పీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.


