News February 9, 2025
కాళేశ్వరం: త్రివేణి సంగమం వద్ద భక్తుల పుణ్య స్నానాలు

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో 42 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేక మహోత్సవాలు ఫిబ్రవరి 7 నుంచి 9 వరకు జరుగుతున్నాయి. కాగా, భక్తులు కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి, ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉ.10:42కు వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.
Similar News
News March 16, 2026
క్యాన్సర్‌తో ప్రతి 18నిమిషాలకు ఒకరు మృతి

తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యాన్సర్ కేసు నమోదవుతుండగా, ప్రతి 18 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. 2025లో రాష్ట్రవ్యాప్తంగా 53,565 కొత్త కేసులు, 29,300 మరణాలు సంభవించాయి. దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ ముప్పు 15% ఎక్కువగా ఉంది. పొగాకు వాడకం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులే ఇందుకు ముఖ్య కారణాలు.
News March 16, 2026
సిద్దిపేట కవికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

ప్రఖ్యాత కవి, రచయిత నందిని <<19398290>>సిధారెడ్డి<<>>కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రచించిన “అనిమేష” కవితా సంపుటికి వచన కవిత్వం విభాగంలో ఈ పురస్కారం దక్కింది. సిద్దిపేట(D) కొండపాక మండలం బందారంలో 1955లో జన్మించిన సిధారెడ్డి విద్యార్థి దశనుంచే కథలు, కవిత్వం రాశారు. మంజీరా రచయితల సంఘం ఏర్పాటు, ‘మంజీర’ బులెటిన్‌కు సంపాదకత్వం వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్‌గా పనిచేశారు.
News March 16, 2026
భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ₹2,240 తగ్గి ₹1,57,420కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹2,050 తగ్గి ₹1,44,300 వద్ద స్థిరపడింది. ఇక కిలో వెండి ధర ఈరోజు ₹4వేలు తగ్గి ₹2,76,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండొచ్చు.


