News February 9, 2025
మోదీ తిరిగి వచ్చాకే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం!

27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం దక్కించుకున్న BJP సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఈ వేడుక PM మోదీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే ఉండనుంది. రేపు పారిస్ వెళ్లనున్న మోదీ అక్కడ జరిగే AI సదస్సులో పాల్గొంటారు. అనంతరం 12, 13న USలో పర్యటిస్తారు. అమెరికా నుంచి ఆయన తిరిగి రాగానే 13 తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు BJP ప్లాన్ చేస్తోంది.
Similar News
News April 4, 2026
రైనా 18ఏళ్ల రికార్డ్ బ్రేక్!

పంజాబ్‌తో పోరులో చెన్నై ఓడినా ఆ జట్టు యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే ప్రదర్శనపై ప్రశంసలు కురుస్తున్నాయి. 43బంతుల్లో 73రన్స్ చేసి జట్టుకు మంచి స్కోర్ అందించిన మాత్రే చెపాక్‌లో రైనా రికార్డ్ బ్రేక్ చేశారు. 18ఏళ్ల 261రోజుల వయసు ఉన్న మాత్రే చెన్నై హోంగ్రౌండ్‌లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచారు. అంతకుముందు 2008లో రైనా(21ఏళ్ల 148రోజులు) MIపై హాఫ్ సెంచరీ కొట్టారు.
News April 4, 2026
పెళ్లి ప్యాకేజీల్లో వెయిట్ లాస్ ఇంజెక్షన్లు!

పెళ్లికి సిద్ధపడే వధూవరులకు వెల్‌నెస్ క్లినిక్‌లు హెయిర్-స్కిన్ కేర్ ప్యాకేజ్‌లు ఆఫర్ చేయడం కామన్. కానీ ఇప్పుడు ఆ జాబితాలో వెయిట్ లాస్ ఇంజెక్షన్లూ చేరాయి. ఢిల్లీలోని ఓ క్లినిక్ ‘మాంజురో బ్రైడ్’ పేరుతో ప్యాకేజ్ ఆఫర్ చేయడం చర్చనీయాంశమైంది. దేశంలోని అనేక క్లినిక్స్ ఇలాంటి ప్యాకేజ్‌లు ఇస్తున్నాయి. పెళ్లికి త్వరగా బరువు తగ్గాలనుకునే జంటల సంఖ్య పెరగడంతో ఈ ట్రెండ్ పుట్టుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
News April 4, 2026
‘రామాయణ’కు ₹700కోట్ల ఓటీటీ ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రొడ్యూసర్?

‘రామాయణ’ ఓటీటీ హక్కులపై ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం ఓ సంస్థ ఏకంగా ₹700Cr ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దానిని నిర్మాత నమిత్ మల్హోత్రా రిజెక్ట్ చేశారట. ₹4వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ మూవీకి ఓటీటీ రైట్స్‌ను ₹1000Crకు అమ్మాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు టాక్. అలాగే రెండు భాగాలకు వేర్వేరు డిజిటల్ రైట్స్ అమ్మే ఆప్షన్‌నూ మూవీ టీమ్ పరిశీలిస్తోందట.


