News March 19, 2024
పటాన్‌చెరులో నీట మునిగి బాలుడు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని గౌతమ్‌నగర్ సమీపంలో మూత పడ్డ పరిశ్రమలో వున్న నీటి గుంతలో నీట మునిగి నిహద్ (10) అనే బాలుుడు మృతి చెందాడు. నలుగురు చిన్నారులు నీటి గుంత వద్దకు ఈతకు వెళ్లగా ఓ చిన్నారి గడ్డపై కూర్చున్నాడు. నీటి గుంతలోకి దిగిన మరో ఇద్దరు రాహుల్ (14), ఫైసల్ (5)లను స్థానికులు రక్షించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News March 31, 2026
మెదక్: నేడు హజ్ యాత్రికుల టీకా శిబిరం

మెదక్ జిల్లా నుంచి హజ్ యాత్రకు ఎంపికైన యాత్రికుల కోసం మంగళవారం (ఈ నెల 31న) ఉదయం 10 గంటలకు జిల్లా ఆసుపత్రిలో టీకా శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా హజ్ కో ఆర్డినేటర్ ఎండి ఎజాజుద్దీన్ తెలిపారు. యాత్రికులందరూ ఈ శిబిరానికి తప్పనిసరిగా హాజరు కావాలని, వచ్చేటప్పుడు తమకు సంబంధించిన అన్ని రకాల అవసరమైన పత్రాలను వెంట తీసుకురావాలని ఆయన కోరారు.
News March 30, 2026
పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ.. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.