News February 9, 2025
పెద్దమందడి మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే మేగారెడ్డి కలిసి సుడిగాలి పర్యటన చేస్తూ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మంత్రికి ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను విడతలవారీగా అమలు చేయడం జరుగుతుందన్నారు.
Similar News
News July 6, 2025
ఖైరతాబాద్: లైసెన్స్ రెన్యూవల్‌కు దూరం.. దూరం !

గ్రేటర్లో ఏ వ్యాపారం నిర్వహించాలన్నా GHMC ట్రేడ్ లైసెన్స్ కచ్చితంగా ఉండి తీరాలి. దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 31లోగా రెన్యూవల్ చేయించాలి. అయితే ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో 10వేల వ్యాపార సంస్థలు ఉంటే 4వేల మంది, జూబ్లిహిల్స్ సర్కిల్లో 15వేల మంది వ్యాపారులు ఉంటే 7వేల మంది మాత్రమే తమ ట్రేడ్ లైసెన్సులు పునరుద్ధరించుకున్నారు. ఏడు నెలలు దాటుతున్నా లైసెన్సు రెన్యూవల్ గురించి వ్యాపారులు ఆలోచించడం లేదు.
News July 6, 2025
ఆట ప్రారంభం.. 10 ఓవర్ల కోత

ఐదో రోజు వర్షం కారణంగా దాదాపు గంటన్నరకుపైగా నిలిచిన భారత్ VS ఇంగ్లండ్ రెండో టెస్టు మ్యాచ్ ఆట ప్రారంభమైంది. 80 ఓవర్లు నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ మ్యాచులో భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సి ఉంది. అటు ఇంగ్లండ్ కష్ట సాధ్యమైన 536 పరుగులు ఛేదించాల్సి ఉంది. దీంతో ఆ జట్టు డ్రా కోసమే ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ENG స్కోరు 72/3. క్రీజులో పోప్(24), బ్రూక్(15) ఉన్నారు.
News July 6, 2025
వ్యాసాశ్రమంలో దశాబ్దాల తర్వాత కలిశారు..!

ఏర్పేడు(M) వ్యాసాశ్రమంలో శ్రీమలయాళస్వామి ఆరాధనోత్సవం జరిగింది. ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు భారీగా తరలి వచ్చారు. 1965 నుంచి 2000వ సంవత్సరం వరకు చదవిన దాదాపు 150 మంది రావడంతో అందరిలోనూ సంతోషం నెలకొంది. ఇక్కడ చదివిన తామంతా ఉన్నతస్థాయికి చేరామని, ఇదంతా మలయాళస్వామి కృపేనని పేర్కొన్నారు. ఏర్పేడులో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మీరూ వ్యాసాశ్రమంలో చదివారా? బ్యాచ్ పేరుతో కామెంట్ చేయండి.