News March 19, 2024
అనకాపల్లి ఎంపీ సీటు ఖరారుకు ఇంకా సమయముంది: వైవీ

అనకాపల్లి ఎంపీ సీటు ఖరారు చేసేందుకు ఇంకా సమయం ఉందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. మంగళవారం విజయవాడ నుంచి విశాఖకు వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో త్వరలోనే అందరికీ తెలుస్తుందన్నారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News November 6, 2025
సమన్వయంతో అధికారులు పనులు పూర్తి చేయాలి: మేయర్

విశాఖలో ఈనెల 14, 15వ తేదీల్లో భాగస్వామ్య సదస్సు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నగరమంతా సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు మేయర్ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు, చేపట్టవలసిన అంశాలు అడిగి తెలుసుకున్నారు.
News November 6, 2025
విశాఖలో ప్రశాంతంగా ముగిసిన కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్‌ల వద్ద వేలాదిమంది భక్తులు సముద్ర స్నానం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీఐజీ గోపినాథ్ ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజల సహకారంతో పాటు రెవెన్యూ, మత్స్య, వైద్య, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.
News November 6, 2025
విశాఖ: 17 నుంచి 30వ తేదీ వరకు కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే

శరీరంపై స్పర్శ లేని మచ్చలు ఉంటే వైద్య సిబ్బందికి తెలియజేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ బుధవారం విజ్ఞప్తి చేశారు. విశాఖలో నవంబర్ 17 నుంచి 30 వరకు కుష్టు వ్యాధి గుర్తింపు కార్యక్రమం (LCDC) పటిష్టంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తారని, ప్రాథమిక దశలో గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు అన్నారు.


