News February 9, 2025
జగిత్యాల జిల్లాలో మొదలైన ఎన్నికల సందడి

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుండటంతో గ్రామాల్లో ఆశావహులు తమదైన రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. పలు చోట్ల మాజీ సర్పంచులతో పాటు.. యువకులు, ఇతరులు ఎన్నికల్లో నెగ్గేందుకు మంతనాలు ప్రారంభించారు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని పలువురు ప్రధాన నేతలను కలుస్తున్నారు.
Similar News
News October 29, 2025
MBNR: ‘మొంథా’ నేపథ్యంలో వరి కోతలు నిలిపివేయాలి: ఏఈఓ

‘మొంథా’ తీవ్ర తుఫాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు వరి కోత పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఏఈఓ యన్. హర్షవర్ధన్ సూచించారు. తుఫాను పూర్తిగా తగ్గిన తర్వాతే కోతలు ప్రారంభించాలని కోరారు. వర్షం కారణంగా పంట నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కోసిన ధాన్యం నిల్వలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆయన రైతులకు తెలిపారు.
News October 29, 2025
సంగారెడ్డి: పాఠశాలలకు 50 శాతం నిధులు విడుదల

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు 50 శాతం నిధులను విడుదల చేస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ నిధులను రెండు రోజుల్లో పాఠశాలల్లోని ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధుల నుంచి పాఠశాలకు కావాల్సిన స్టేషనరీ, మౌలిక సదుపాయాల రిపేర్‌లకు వినియోగించుకోవచ్చన్నారు.
News October 29, 2025
కర్నూలు జిల్లాలో పాఠశాలలకు సెలవు

‘మొంథా’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ రోజు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తెలిపారు. స్టడీ క్లాసులు లేదా అదనపు తరగతులు నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ఇంటి వద్ద సురక్షితంగా ఉంచాలని సూచించారు.


